Blood Purifying: రక్తాన్ని శుద్ధిచేసే ఆహారాలు ఇవే..!
Blood Purifying: ఆరోగ్యంగా ఉండాలంటే రక్తాన్ని శుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరం.
Blood Purifying: ఆరోగ్యంగా ఉండాలంటే రక్తాన్ని శుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరం. మీ శరీరం సరిగ్గా పనిచేయాలంటే రక్త శుద్ధి ఆహారాలు తినాలి. ఎందుకంటే ఇవి శరీరంలోని ప్రతి కణానికి ఆక్సిజన్, పోషణను అందించడమే కాకుండా కాలుష్య కారకాలు, వ్యర్థాలను తొలగిస్తాయి. శరీరం సాధారణ పనితీరును నిర్వహించడానికి, వ్యాధులను తొలగించడానికి రక్త శుద్దీకరణ చాలా ముఖ్యం. దీనివల్ల మూత్రపిండాలు, గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, శోషరస వ్యవస్థ సక్రమంగా పనిచేస్తాయి. రక్తాన్ని శుభ్రపరచడంలో సహాయపడే ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం.
1. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్
గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఎల్లప్పుడూ ఆరోగ్యానికి చాలా మంచివి. ఎందుకంటే వీటిలో పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి వ్యాధులను దూరం చేస్తాయి. పాలకూర, బచ్చలికూర, ఇంకా రకరకాల ఆకుకూరలు రక్త ప్రసరణను నిర్వహించడానికి సహాయపడతాయి.
2. అవకాడో
అవోకాడో ఉత్తమ సహజ రక్త శుద్ధి ఆహారాలలో ఒకటి. ఇది రక్త నాళాలను దెబ్బతీసే విషాలని బయటకు పంపుతుంది. అవోకాడోలో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది. ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే హాని నుంచి మన చర్మాన్ని కాపాడుతుంది. అవకాడోలు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌ల గొప్ప మూలం.
3. బ్రోకలీ
బ్రోకలీ శరీరం నుంచి విషాన్ని బయటకు పంపే ఉత్తమ ఆహారాలలో ఒకటి. ఇందులో కాల్షియం, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ సి, పొటాషియం, మాంగనీస్, ఫాస్పరస్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. శరీరాన్ని డీ హైడ్రేట్ చేయడంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో బాగా పనిచేస్తుంది.
4. నిమ్మకాయ
నిమ్మకాయను శతాబ్దాలుగా ఔషధంగా ఉపయోగిస్తున్నారు. మీరు ఒక గ్లాసు గోరువెచ్చని నిమ్మరసం తాగితే శరీరం నుంచి అన్ని రకాల టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి. నిమ్మకాయలో విటమిన్ సి, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే ఇది రక్తాన్ని సులభంగా శుభ్రపరుస్తుంది.