Parenting Tips: బాలింతలు ఈ చిట్కాలు పాటిస్తే తల్లి పాల ఉత్పత్తి పెరుగుతుంది

Parenting Tips: డెలివరీ తర్వాత, తల్లిపాలు ఇచ్చే సమయంలో వారు మరింత పోషకమైన ఆహారాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా, గర్భిణీ స్త్రీలు తల్లి పాలను పెంచే కొన్ని ఆహారాలను క్రమం తప్పకుండా తినాలి. ఆ ఆహారాలు ఏమిటి ? తెలుసుకుందాం

Update: 2024-08-12 06:45 GMT

Parenting Tips: బాలింతలు ఈ చిట్కాలు పాటిస్తే తల్లి పాల ఉత్పత్తి పెరుగుతుంది

 Parenting టిప్స్ : బాలింతలు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యల్లో తల్లి పాలు లేకపోవడం ఒకటి. నవజాత శిశువులకు తల్లి పాలు ఇవ్వకపోతే వారికి సంపూర్ణ పోషకాహారం లభించదు. తల్లిపాలు అనేవి వారికి అమృతం. పసిపిల్లలకు తల్లి పాలు తాగితేనే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పసికందు ఆకలిని తీర్చేది తల్లి పాలే. చంటి పిల్లలు మొదటి సంవత్సరం పూర్తిగా తల్లిపాలు తాగితేనే వారికి జీవితాంతం సరిపడా రోగ నిరోధక శక్తి లభిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో చాలామంది బాలింతలకు తల్లిపాలు సరిగ్గా ఉత్పత్తి అవడం లేదు.దీని ప్రభావం బిడ్డ ఆరోగ్యంపై చూపుతుంది. ప్రస్తుతం అనారోగ్యకరమైన ఆహారం కారణంగా తల్లి పాలు లేని సమస్యను ఎదుర్కొంటున్న మహిళల సంఖ్య పెరుగుతోంది. డెలివరీ తర్వాత, తల్లిపాలు ఇచ్చే సమయంలో వారు మరింత పోషకమైన ఆహారాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా, గర్భిణీ స్త్రీలు తల్లి పాలను పెంచే కొన్ని ఆహారాలను క్రమం తప్పకుండా తినాలి. ఆ ఆహారాలు ఏమిటి ?

మెంతులు :

మెంతులు స్త్రీలకు సంబంధించిన అనేక సమస్యలకు మందు. బహిష్టు నొప్పిని తగ్గించే శక్తి కూడా దీనికి ఉంది. అలాగే, ఇది మహిళల్లో తల్లి పాల ఉత్పత్తిని పెంచుతుంది. పాల ఉత్పత్తిని పెంచడానికి మెంతులను కొన్ని ఆయుర్వేద మందులలో ఉపయోగిస్తారు. మెంతులను ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టి, ఉదయాన్నే తాగవచ్చు.అలాగే మెంతిపొడి చేసి అన్నంలో కలుపుకొని తింటే తల్లిపాల ఉత్పత్తి పెరుగతుంది.

సోంపు గింజలు :

స్త్రీలలో తల్లి పాలను పెంచే మరో ముఖ్యమైన ఆహారంలో సోంపుగింజలు ప్రధానమైనవి. సోంపు గింజలు నానబెట్టిన నీటిని బాలింతలు తాగవచ్చు. లేదా నీటిలో సోంపు గింజలు వేసి మరిగించి ఆ నీటిని కూడా తాగవచ్చు. తల్లి ఈ నీటిని తాగితే అది పాల ద్వారా బిడ్డ కడుపులోకి చేరుతుంది. నవజాత శిశువులలో గ్యాస్ట్రిక్ , అజీర్ణ సమస్యలు కూడా తొలగిపోతాయి.

నువ్వులు :

పాలిచ్చే తల్లులు నువ్వుల లడ్డూ లేదా నువ్వుల గింజలను తినడం వల్ల వారి ఆరోగ్యానికి మంచిది , పాల ఉత్పత్తి పెరుగుతుంది. నువ్వులలో కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది. దీన్ని తింటే బిడ్డకు పోషకాహారం కూడా అందుతుంది. నువ్వులు, ఖర్జూరం, ఎండు కొబ్బరి, నెయ్యి వేసి లడ్డూ లేదా ముద్దలా చేసి తినాలి.

జాజికాయ రసం:

జాజికాయలో తల్లి పాల ఉత్పత్తిని పెంచే పదార్థాలు కూడా ఉన్నాయి. జాజికాయ పొడిని నీళ్లలో కలిపి తాగాలి. ఇలా తాగితే తల్లి పాలు పెరుగుతాయి..

Tags:    

Similar News