Health Tips: శరీరంలో కొలస్ట్రాల్ పెరిగినప్పుడు ఈ వ్యాధుల ప్రమాదం ఎక్కువ..!
Health Tips: శరీరంలో కొలస్ట్రాల్ పెరిగినప్పుడు ఈ వ్యాధుల ప్రమాదం ఎక్కువ..!
Health Tips: కొలెస్ట్రాల్ శరీరంలో ఒక మైనపు పదార్థం. ఆరోగ్యకరమైన కణాలను నిర్మించడానికి ఇది సహాయపడుతుంది. అయితే కొలెస్ట్రాల్ అధికంగా పెరగడం వల్ల చాలా సమస్యలు ఏర్పడుతాయి. అధిక కొలెస్ట్రాల్ రక్తనాళాల్లో కొవ్వు పెరగడానికి కారణమవుతుంది. కొన్నిసార్లు ఇది గుండెపోటుకు దారితీస్తుంది. కొలెస్ట్రాల్ పెరగడం వల్ల కలిగే సమస్యల గురించి ఈ రోజు తెలుసుకుందాం.
ఛాతీలో నొప్పి
కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు ఛాతీ నొప్పి ఏర్పడుతుంది. ఇలాంటి సందర్భంలో అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులు ప్రభావితమవుతాయి. దీని కారణంగా ఛాతీ నొప్పి సమస్య ఏర్పడుతుంది.
గుండెపోటు
కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు గుండెపోటు ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. దీనివల్ల కణాలలో కొవ్వు గడ్డకట్టడం మొదలవుతుంది. దీంతో రక్త ప్రసరణ ఆగిపోతుంది. గుండెపోటు సంభవిస్తుంది.
స్ట్రోక్
కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు స్ట్రోక్ ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. రక్తం గడ్డకట్టడం వల్ల మెదడులోని భాగానికి రక్త ప్రవాహాన్ని అడ్డుకున్నప్పుడు స్ట్రోక్ సంభవిస్తుంది.
అధిక రక్తపోటు
కొలెస్ట్రాల్ పెరగడం వల్ల అధిక రక్తపోటు సమస్య ఏర్పడుతుంది. గుండెపై ఎక్కువ ఒత్తిడి ఉన్నప్పుడు రక్తపోటు పెరుగుతుంది.
కిడ్నీ వ్యాధి
కొలెస్ట్రాల్ పెరగడం వల్ల కిడ్నీ వ్యాధి కూడా వస్తుంది. ఎందుకంటే కొలెస్ట్రాల్ పెరుగుదల మొత్తం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.