Coconut Water Benefits: కొబ్బరి బోండాం నీటితో వృద్ధాప్య ఛాయలకు దూరం
Coconut Water Benefits: కొబ్బరినీళ్లలో వుండే సైటోకినిన్స్ వల్ల వృద్ధాప్య ఛాయలను దూరం చేసి చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి.
Coconut Water Benefits: బయట ఎండలు బాగా మండుతున్నాయి. ఎన్ని నీళ్ళు తాగుతున్నా గొంతు తడారిపోతోంది. నీరసంగా వుంటోంది. అలాంటప్పుడు ఠక్కున గుర్తుకు వచ్చేవి శీతల పానియాలు. వాటిని తీసుకోవడం వల్ల తాగినపుడు బాగానే ఉన్నా మళ్లీ కొద్ది సేపటికే దాహం వేస్తుంది. ఆరోగ్యానికి హానికరమని వైద్యలు చెప్తున్నారు. అలాంటపుడు సహజసిద్దంగా దొరికేవి పానియాల్లో కొబ్బరిబోండా నీళ్లు. ఇవి ఎంతో శ్రేష్టమైనవి. ఎలాంటి రసాయనాలు లేకుండా ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయి. మన దేశంలో కొబ్బరి బోండాలకు ఉన్న గిరాకీ మరెక్కడా ఉండదేమో.. కదా. హెచ్ ఎం టివి లైఫ్ స్టైల్ లో తెలుసుకుందాం...
- కొబ్బరి నీళ్లలో పొటాషియం, సోడియం, డైటరీ ఫైబర్, విటమిన్ సి, మెగ్నిషియం, కాల్షియం, సెలీనియం వంటి ఎన్నో విటమిన్లు, మినరల్స్ కొబ్బరి నీటిలో ఉంటాయి.వీటి వల్ల మనకు సంపూర్ణ పోషకాహారం అందడమే కాదు, పలు అనారోగ్యాలు కూడా దూరమవుతాయి.
- కొబ్బరి నీళ్లను ఉదయాన్నే పరగడుపున తాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురి కాకుండా ఉంటుంది. దీంతో శరీరంలో ఉన్న ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి.
- శరీరానికి కావల్సిన ముఖ్యమైన మినరల్స్, ఎలక్ట్రోలైట్స్ ఉదయాన్నే అందుతాయి, కాబట్టి రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు మెదడు పనితీరు మెరుగు పడుతుంది.నరాల సంబంధ సమస్యలు తొలగిపోతాయి.కండరాలకు పుష్టి కలుగుతుంది. కొబ్బరినీళ్లలో సైటోకినిన్స్ అనబడే పోషకాలు ఎక్కువగా ఉంటాయి.ఇవి వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తాయి. చర్మం కాంతివంతంగా మారేలా చేస్తాయి
- కొబ్బరి నీళ్లలోని ఔషధ గుణాలు శరీరంలోకి ప్రవేశించిన హానికరమైన బ్యాక్టీరియాతో పోరాడగలవు. ఈ కోలి, పి ఎరుగినోస, బీ సబ్ టిల్స్ , ఆరియస్ వంటి బ్యాక్టీరియాపై కొబ్బరి నీళ్లు ప్రభావంతంగా పని చేస్తాయి. కొబ్బరి నీరు యాంటీమోక్రోబియాల్ గా పని చేస్తుంది. రోజూ కొబ్బరినీరు తాగడం త్వరగా బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇందులోని ఎలెక్ట్రోలైటీ అనేది అధికంగా ఉంటుంది. ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే ఇందులో మాంగనీస్ ఎక్కువగా ఉంటుంది. దీంతో జీవక్రియ పెరిగి ఫ్యాట్ మొత్తం కరిగిపోతుంది.
- కొబ్బరి నీళ్లను తాగడం వల్ల కిడ్నిలోని చిన్నసైజ్ రాళ్లు త్వరగా కరిగించుకోవొచ్చు. అలాగే కిడ్నీల్లోని వ్యర్థ పదార్థాలు మొత్తం కూడా బయటకు వెళ్లడానికి కొబ్బరి నీళ్లు బాగా ఉపయోగపడతాయి. కండరాల తిమ్మిరిని తగ్గించడంలో కొబ్బరి నీళ్లు బాగా ఉపయోగపడతాయి. రక్తంలో పొటాషియం స్థాయి తక్కువగా ఉంటే ఇలాంటి తిమ్మిర్లు వస్తాయి. అయితే కొబ్బరి నీరు పొటాషియం స్థాయిని పెంచుతుంది. కాల్షియం, మెగ్నీషియం అధికంగా ఎండటం వల్ల ఎముకల్ని బలంగా చేస్తాయి. రక్తం గడ్డకట్టే సమస్యను కొబ్బరి నీళ్లు పరిష్కరిస్తాయి. కొందరిలో ఈ సమస్య ఏర్పడుతుంటుంది. దీన్ని కొబ్బరి నీళ్లు తాగడం ద్వారా పరిష్కరించుకోవొచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం ఈ కాలంలో రెగ్యులర్ గా కొబ్బరి బోండా నీరు సేవిస్తూ వుంటే పోలా..