Health Tips: ఒత్తిడి, ఆందోళన తగ్గాలంటే ఈ ఆహారాలు డైట్‌లో ఉండాల్సిందే..

Foods to Relieve Stress and Anxiety: ఆధునిక జీవితంలో చాలామంది ఒత్తిడి, ఆందోళనకు గురువుతున్నారు. దీనికి కారణాలు చాలా ఉన్నాయి.

Update: 2021-12-13 14:00 GMT

 ఒత్తిడి, ఆందోళన తగ్గాలంటే ఈ ఆహారాలు డైట్‌లో ఉండాల్సిందే..(ఫైల్-ఫోటో)

Foods to Relieve Stress and Anxiety: ఆధునిక జీవితంలో చాలామంది ఒత్తిడి, ఆందోళనకు గురువుతున్నారు. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. కొంతమంది ఉరుకుల, పరుగుల ఉద్యోగాలతో సతమతమవుతుంటే మరికొందరు కుటుంబ సమస్యల వల్ల ఒత్తిడికి లోనవుతున్నారు. అయితే ఇలాంటి ఒత్తిడిని తొలగించుకోవాలంటే యోగా, ధ్యానంతో పాట మంచి డైట్‌ కూడా మెయింటెన్‌ చేయాలి. కచ్చితంగా ఈ 5 ఆహారాలు తినాలి. వాటి గురించి ఒక్కసారి తెలుసుకుందాం.

1. ఒమేగా-3 సమృద్ధిగా ఉండే ఆహారాలు ఒమేగా-3 మంట, ఆందోళనను తగ్గించడంలో సహాయపడతాయి. నెయ్యి వంటి ఆహారాలలో ఒమేగా-3 పుష్కలంగా ఉంటుంది. ఆహారంలో ప్రతిరోజూ కనీసం 1 టీస్పూన్ నెయ్యి తీసుకోవాలని సూచించారు.

2. ట్రిప్టోఫాన్ పుష్కలంగా ఉండే ఆహారాలు పెరుగు తినడం వల్ల ఒత్తిడి అంతా తొలగిపోతుంది. పెరుగు మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది బ్యాక్టీరియా, లాక్టోబాసిల్లస్, బిఫిడోబాక్టీరియా మూలకాలను కలిగి ఉంటుంది. ఆహారంలో పెరుగును చేర్చుకోవడం వల్ల గట్ సహజ బ్యాక్టీరియాకు ప్రయోజనం చేకూరుతుంది. ఆందోళన ఒత్తిడి తగ్గుతుంది.

3. మెగ్నీషియం, పొటాషియం అధికంగా ఉండే ఆహారాలు అరటిపండ్లు, గుమ్మడికాయ గింజలు పొటాషియం, మెగ్నీషియం అద్భుతమైన మూలాలు. ఇవి ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్‌ను నియంత్రించడంలో, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. ఈ ఆహారాలను తినడం వల్ల ఒత్తిడి, ఆందోళన లక్షణాలను తగ్గించుకోవచ్చు.

4. విటమిన్ డి ఆహారాలు విటమిన్ డి లోపం ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలకు దారితీస్తుంది. అందుకే ఉదయం పూట సూర్యకాంతి పడేవిధంగా వాకింగ్‌ చేయాలి. ఇది కాకుండా విటమిన్ డి ఉన్న ఆహారాన్ని ఆహారంలో చేర్చితే ఒత్తిడి నుంచి తప్పించుకోవచ్చు.

5. నానబెట్టిన ఎండుద్రాక్ష, కుంకుమపువ్వు రాత్రి నిద్రపోయే ముందు ఎండుద్రాక్షలో నానబెట్టిన 4-5 కుంకుమపువ్వు తినండి. వాటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడటమే కాకుండా ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

Tags:    

Similar News