పసుపు శుభసూచకమే కాదు.. ఆరోగ్యప్రదాయని కూడా!

Benefits of Turmeric: పసుపుతో ఉపయోగాలు.. పసుపును పాలల్లో కలిపి తీసుకుంటే ఏం జరుగుతుంది?

Update: 2020-08-17 14:14 GMT
Benefits of Turmeric

పసుపుకు భారతీయ సంప్రదాయానికి ఎనలేని సంబంధం ఉంది. శుభసూచకంగా పసుపును చూస్తారు. గుమ్మానికి పసుపు రాయడం(పసుపు రంగు కాదు), కాళ్ళకి పసుపు రాసుకోవడం.. ముఖానికి పసుపు దట్టించడం..అంతెందుకు కూర ఏది వండినా సరే చిటికెడు పసుపు కచ్చితంగా వేయకుండా ఉండరు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే చాలా మంది ఈ మధ్య పసుపు నీళ్ళు తాగడం.. పసుపుతో ఆవిరి పట్టడం..పాలల్లో పసుపు కలుపుకోవడం వంటి విధానాలు పాటిస్తున్నారు. అందుకే.. అసలు పసుపు వాడకం వలన కలిగే లాభాలు.. పసుపు తెచ్చే శుభాలు ఒక్కసారి తెలుసుకుందాం.

పసుపు ఒక విధంగా సర్వరోగ నివారిణి. ఎందుకంటే ఇది చెడు బాక్టీరియాను దరిచేరనివ్వదు. మన పూర్వీకులకు పసుపు చేసే మేలు బాగా తెలుసు. అందుకే వారు ఆరోగ్య చిట్కాలలో పసుపును వాడేవారు. ఇప్పటికీ మన ఇళ్ళలో పెద్దవారు ఇంట్లో ఎవరికైనా చిన్న దెబ్బ తగిలింది అంటే వెంటనే పసుపు తీసుకొచ్చి అక్కడ అద్దేస్తారు. ఇక పసుపు పాలల్లో కలుపుకుని తాగడం వల్ల చాలా ఉపయోగాలున్నాయని చెబుతారు. అవి ఇవే..

- ఇక పసుపులో ఉండే ఔషద గుణాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. పసుపులో ఉండే కర్‌క్యుమిన్‌ శరీరంలో వైరస్‌ వృద్ధిని అరికడుతుంది. నీటి ద్వారా శరీరంలోకి - చేరుకున్న వైరస్‌ రెట్టింపు కాకుండా పసుపు నియంత్రిస్తుంది.

- పసుపులో ఉండే యాంటీసెప్టిక్, యాస్ట్రింజెంట్ వల్ల శ్వాసకోస సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. దగ్గు, జలుబుతో బాధపడేవారు పసుపు పాలను తీసుకుంటే ఉపశమనం పొందవచ్చు. ముక్కు దిబ్బడ, తలనొప్పి, ఇతర నొప్పులను తగ్గిస్తుంది.

- పసుపు పాలలో ఉండే పోషకాలు రక్త ప్రసరణను మెరుగుపరిచి లింఫాటిక్‌ సిస్టమ్‌ను కూడా శుద్ధిచేస్తాయి. కామెర్లు దరిచేరకుండా పసుపు పాలు శరీరానికి రక్షణ కల్పిస్తుంది. కాలేయంలో చేరే విషకారకాలను హరిస్తుంది.

- పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ వల్ల కీళ్లు బలపడతాయి. రుతుక్రమం వల్ల కలిగే పొత్తి కడుపు, ఇతర ఒంటి నొప్పులను దూరం చేస్తుంది.

- కఫం ఎక్కువగా ఉండి ఇబ్బందిపడేవారు వెచ్చని పసుపు పాలు తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. పాలలో సెరటోనిన్‌ అనే బ్రెయిన్‌ కెమికల్‌, మెలటోనిన్‌లు ఉంటాయి. ఇవి పసుపులో ఉండే వైటల్‌ న్యూట్రియంట్స్‌తో కలిసి ఒత్తిడిని తొలగిస్తాయి. ఫలితంగా మంచి నిద్ర పడుతుంది. 

Tags:    

Similar News