తల్లిపాలు పిల్లలకి ఒక వరం.. అంతేకాదు బోలెడు ప్రయోజనాలు..!

తల్లిపాలు పిల్లలకి ఒక వరం.. అంతేకాదు బోలెడు ప్రయోజనాలు..!

Update: 2022-09-18 14:30 GMT

తల్లిపాలు పిల్లలకి ఒక వరం.. అంతేకాదు బోలెడు ప్రయోజనాలు..!

Breastfeeding: తల్లిబిడ్డల సంబంధం అన్ని సంబంధాల కంటే గొప్పది. వాస్తవానికి బిడ్డ పుట్టిన తర్వాత కొంత కాలం పాటు వారికి తల్లి పాలు తాగిపిస్తారు. ఇది మినహాయించి కొన్ని నెలలపాటు శిశువులకి ఏమి ఇవ్వకూడదని సూచిస్తారు. తల్లి పాలు బిడ్డకు ఒక వరం అని చెప్పాలి. తల్లిపాలు తాగకపోతే పిల్లల ఎదుగుదలపై చాలా ప్రభావం పడుతుంది. తల్లిపాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

తల్లిపాలు బిడ్డ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. తల్లి పాలలో బిడ్డ ఎదుగుదలకు అవసరమైన అన్ని పోషకాలు ఉంటాయి. అంతే కాకుండా తల్లిపాలు ఇవ్వడం వల్ల పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గర్భం లోపల వాతావరణం శిశువుకు చాలా సురక్షితమైనది కానీ పుట్టిన తర్వాత తల్లి పాలు పిల్లల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. తద్వారా బిడ్డ బయట వాతావరణంలో ఉన్న వైరస్లు, బ్యాక్టీరియాతో పోరాడగలడు.

బిడ్డ గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత తల్లి వద్ద మాత్రమే రక్షణ లభిస్తుంది. ఇందులో తల్లిపాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లి, బిడ్డల మధ్య మంచి అనుబంధం ఏర్పడుతుంది. ఈ కారణంగా శిశువులు తొందరగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. పిల్లలకు కనీసం ఆరు నెలల పాటు తల్లిపాలు ఇవ్వాలి. ఇంతకంటే తక్కువగా ఇస్తే వారు అంత బలంగా ఉండరు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అందుకే వైద్యులు కూడా కనీసం ఆరు నెలలు తల్లిపాలు ఇవ్వాలని సూచిస్తారు.

Tags:    

Similar News