Before Heart Attack: గుండెపోటుకు ముందు బాడీలో ఈ 5 ప్రదేశాల్లో నొప్పి ఉంటుంది.. విస్మరిస్తే అంతే సంగతులు..!

Before Heart Attack: ఆధునిక కాలంలో ప్రపంచవ్యాప్తంగా గుండెపోటుతో మరణించే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. దీనికి మారిన జీవన పరిస్థితులు, ఆహారపు అలవాట్లే కారణమవుతున్నాయి. 50 ఏళ్ల తర్వాత రావాల్సిన గుండెపోటు ప్రస్తుతం 20, 25 ఏళ్లలోనే వస్తుంది.

Update: 2024-04-23 14:30 GMT

Before Heart Attack: గుండెపోటుకు ముందు బాడీలో ఈ 5 ప్రదేశాల్లో నొప్పి ఉంటుంది.. విస్మరిస్తే అంతే సంగతులు..!

Before Heart Attack: ఆధునిక కాలంలో ప్రపంచవ్యాప్తంగా గుండెపోటుతో మరణించే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. దీనికి మారిన జీవన పరిస్థితులు, ఆహారపు అలవాట్లే కారణమవుతున్నాయి. 50 ఏళ్ల తర్వాత రావాల్సిన గుండెపోటు ప్రస్తుతం 20, 25 ఏళ్లలోనే వస్తుంది. చాలామంది చిన్న వయసులో చనిపోతున్నారు. కూర్చొని పనిచేసే ఉద్యోగాలు చేయడం, శారీరక శ్రమ లేకపోవడం, వీటికి తోడు చెడ్డ అలవాట్ల వల్ల ఈ పరిస్థితి ఎదురవుతుంది. అయితే ఈ రోజు గుండెపోటు వచ్చే బాడీలో కొన్నిచోట్ల నొప్పిగా ఉంటుంది. అలాంటి నొప్పి ఎదురైనప్పుడు వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

దవడలో నొప్పి

దవడలో నొప్పి ద్వారా గుండెపోటును చాలా రోజుల ముందుగానే గుర్తించవచ్చు. గుండెపోటు సమయంలో దవడ నొప్పి భరించలేనిదిగా ఉంటుంది.

మెడ నొప్పి

గుండెపోటు ప్రారంభ లక్షణం మెడ నొప్పి. మీరు చాలా కాలంగా మెడ నొప్పిని అనుభవిస్తున్నట్లయితే దానిని మైనర్‌గా పరిగణించవద్దు. వైద్యుడితో చెక్‌ చేపించుకోవాలి.

భుజం నొప్పి

గుండెకు దగ్గరగా ఉండటం వల్ల భుజంలో నొప్పి వస్తుంది. ఇలాంటి నొప్పి వస్తే వెంటనే డాక్టర్‌ వద్దకు వెళ్లి చెక్‌ చేయించుకోవాలి.

వెన్నునొప్పి

దీర్ఘకాలిక వెన్నునొప్పి కూడా గుండెపోటు ఒక లక్షణం. చాలా మంది తప్పుగా కూర్చోవడం లేదా నిద్రించడం వల్ల ఈ సమస్య ఎదురవుతుంది. చాలా సందర్భాల్లో ఇది గుండెపోటుకు కారణమవుతుంది. ఈ నొప్పి ఉన్నప్పుడు డాక్టర్‌ను సంప్రదించి మందులు వాడాలి.

ఛాతి నొప్పి

గుండెపోటుకు అత్యంత సాధారణ సంకేతం ఛాతీ నొప్పి. ఇది గుండెపోటు సమయంలోనే కాకుండా చాలాసార్లు వస్తుంది. అయితే దీనిని గుర్తించడంలో చాలామంది కన్‌ఫ్యూజ్‌ అవుతుంటారు. అందుకే ఎలాంటి నొప్పి వచ్చినా డాక్టర్‌ని సంప్రదించి క్లారీటీగా తెలుసుకోవడం అవసరం. 

Tags:    

Similar News