Beetroot: బీట్‌రూట్‌ అద్భుతం.. లాభాలు తెలిస్తే తినకుండా ఉండలేరు..!

Beetroot: బీట్‌రూట్ తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి

Update: 2022-09-02 04:30 GMT

Beetroot: బీట్‌రూట్‌ అద్భుతం.. లాభాలు తెలిస్తే తినకుండా ఉండలేరు..!

Beetroot: బీట్‌రూట్ భూగర్భంలో పండే దుంప. ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బీట్‌రూట్‌ను అనేక విధాలుగా తీసుకోవచ్చు. ఇందులో కూరగాయలు, సలాడ్‌లు, రసాలు ఉంటాయి. చాలా మందికి దీని రుచి నచ్చదు కానీ పోషక విలువలు తెలిసిన వారు ఖచ్చితంగా ఆహారంలో చేర్చుకుంటారు. బీట్‌రూట్‌లో కాల్షియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్‌లతో సహా అనేక పోషకాలు ఉంటాయి. మీరు 10 గ్రాముల బీట్‌రూట్ తింటే మీకు 43 మిల్లీగ్రాముల కేలరీలు, 2 గ్రాముల కొవ్వు మాత్రమే లభిస్తుంది. అంటే శరీర బరువు పెరగదు.

బీట్‌రూట్ తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా మనం అనేక వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి బయటపడుతాము. ముఖ్యంగా దీని రసం తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. తరచుగా మలబద్ధకం, కడుపు సమస్యలు ఉన్నవారు బీట్‌రూట్‌ను తప్పనిసరిగా తినాలి. ఎందుకంటే ఇందులో ఉండే ఫైబర్ మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది సహజ చక్కెర గొప్ప మూలం. ఇది మన శరీరానికి శక్తిని అందించడానికి పనిచేస్తుంది.

మీకు అధిక రక్తపోటు సమస్య ఉంటే ఖచ్చితంగా బీట్‌రూట్ సలాడ్ లేదా జ్యూస్ తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల కొన్ని రోజుల్లో బీపీ అదుపులో ఉంటుంది. తరచుగా అలసట లేదా బలహీనత ఉంటే బీట్‌రూట్ దివ్యౌషధం కంటే తక్కువేమి కాదు. బీట్‌రూట్ తినడం వల్ల రక్త శుద్ధి జరుగుతుంది. ఇది శరీరంలో ఆక్సిజన్ స్థాయిని పెంచుతుంది. బీట్‌రూట్ మన అందానికి చాలా ముఖ్యమైనది. ఇది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. ముఖంపై అద్భుతమైన గ్లో ఇస్తుంది.

Tags:    

Similar News