Women Health Tips: ప్రెగ్నెన్సీ సమయంలో బ్యాడ్‌ కొలస్ట్రాల్‌ సమస్య.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..!

Women Health Tips:ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఈ సమయంలో మహిళల శరీరంలో హార్మోన్లలో మార్పులు జరుగుతాయి. అధిక బీపీ, ఐరన్ సమస్యలతో బాధపడుతారు. చెడ్డ ఆహారపు అలవాట్ల వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరిగే ప్రమాదం ఉంది.

Update: 2023-12-19 15:30 GMT

Women Health Tips: ప్రెగ్నెన్సీ సమయంలో బ్యాడ్‌ కొలస్ట్రాల్‌ సమస్య.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..!

Women Health Tips: ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఈ సమయంలో మహిళల శరీరంలో హార్మోన్లలో మార్పులు జరుగుతాయి. అధిక బీపీ, ఐరన్ సమస్యలతో బాధపడుతారు. చెడ్డ ఆహారపు అలవాట్ల వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరిగే ప్రమాదం ఉంది. దీనిని సకాలంలో నియంత్రించకపోతే చాలా అనర్థాలు జరుగుతాయి. గుండెపోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ప్రెగ్నెన్సీ సమయంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఈ రోజు తెలుసుకుందాం.

ఛాతి నొప్పి

ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలకు ఛాతీ నొప్పి ఉంటే ఇది గ్యాస్ వల్ల కాదు. చెడు కొలెస్ట్రాల్ పెరుగుతోందని సంకేతం. ఈ సందర్భంలో మీరు వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లాలి. అజాగ్రత్త కారణంగా ఇది తరువాత గుండెపోటుకు దారితీస్తుంది.

ప్రతిరోజూ వికారం

ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు వాంతులు చేసుకుంటారు. ఈ సమస్య నిరంతరంగా ఉంటే చెడు కొలెస్ట్రాల్ వల్ల జరుగుతుందని అర్థం చేసుకోవాలి. వెంటనే మహిళలు లిపిడ్ ప్రొఫైల్‌ను పరీక్షించుకోవాలి.

అలసట

గర్భధారణ సమయంలో మహిళలు ఎక్కువ శారీరక శ్రమ చేయరు. కానీ విశ్రాంతి సమయంలో కూడా నిరంతరం అలసట ఉంటే అది అధిక కొలెస్ట్రాల్ లక్షణం అవుతుంది. మహిళలు ఈ సమస్యపై శ్రద్ధ వహించాలి. అలాగే శరీరంలో ఏదైనా విటమిన్ లోపం కూడా కావొచ్చు.

రక్తపోటు పెరుగుదల

రక్తపోటు పెరిగితే గుండె జబ్బులు వస్తాయి. కొన్ని సందర్భాల్లో BP పెరుగుదల చెడు కొలెస్ట్రాల్ పెరుగుదలకు సంకేతంగా చెబుతారు. ప్రెగ్నెన్సీ సమయంలో అధిక రక్తపోటు ఉన్న మహిళలు తరచుగా టెస్టులు చేయించుకోవాలి.

ఇలా రక్షించుకోండి

ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. వైద్యుల సలహా మేరకు డైట్ ప్లాన్ చేసుకోండి. మానసిక ఒత్తిడికి దూరంగా ఉండండి.

Tags:    

Similar News