Health Tips: బస్సు లేదా రైలులో ప్రయాణించేటప్పుడు వాంతులు అవుతున్నాయా..!

Health Tips: కొంతమంది బస్సులో కానీ రైలులో కానీ ప్రయాణిస్తున్నప్పుడు ఒక్కసారిగా వాంతులు చేసుకుంటారు.

Update: 2023-07-27 16:00 GMT

Health Tips: బస్సు లేదా రైలులో ప్రయాణించేటప్పుడు వాంతులు అవుతున్నాయా..!

Health Tips: కొంతమంది బస్సులో కానీ రైలులో కానీ ప్రయాణిస్తున్నప్పుడు ఒక్కసారిగా వాంతులు చేసుకుంటారు. ముఖ్యంగా ఈ సమస్య పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది. జర్నీలో ఎదురయ్యే కొన్ని వాసనలు, గాలి వల్ల చాలా ఇబ్బందిపడుతారు. దీంతో తల తిరగడం, వాంతులు చేసుకవడం జరుగుతుంది. ఈ పరిస్థితిని మోషన్ సిక్‌నెస్ అంటారు. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో ఈరోజు తెలుసుకుందాం.

ముందుగా ప్రయాణ సమయంలో అవసరమైన మందులను దగ్గర ఉంచుకోవాలి. గ్యాస్, అసిడిటీ సమస్యలు ఉంటే డాక్టర్ సలహాలు పాటించాలి. సుదీర్ఘ ప్రయాణానికి వెళ్లవలసి వచ్చినప్పుడు టీ, కాఫీలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇవి జీర్ణక్రియ ప్రక్రియను పాడుచేసి కడుపులో గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తాయి. అందుకే ఇవి తాగకూడదు. అలాగే ప్రయాణం చేసేటప్పుడు పొరపాటున కూడా ఖాళీ కడుపుతో ఉండకూడదు. సులభంగా జీర్ణమయ్యే కొన్ని ఆహారాలని తీసుకోవాలి. దీని వల్ల ఎలాంటి కడుపు నొప్పి ఉండదు.

ప్రయాణంలో తరచుగా వాంతులు చేసుకుంటే నోటిలో యాలకులు పెట్టుకోవాలి. ఇవి వికారం సమస్యని తొలగిస్తుంది. ప్రయాణం చేసేరోజు ఖాళీ కడుపుతో అర టీస్పూన్ నల్ల ఉప్పు, నిమ్మకాయ రసం, తేనె కలిపి తాగితే గ్యాస్‌కు సంబంధించిన సమస్యలు దరిచేరవు. ప్రయాణంలో ఖాళీ కడుపుతో గోరువెచ్చని పాలు తాగకూడదు. దారిలో శరీరానికి నీటి కొరత రానివ్వద్దు. పండ్ల రసాలను తాగుతూ ఉండాలి. ప్రయాణంలో నిమ్మ, నారింజ, వంటి సిట్రస్ పండ్లను తింటూ ఉండాలి. అర గ్లాసు నీటిలో ఒక చెంచా యాపిల్ వెనిగర్ మిక్స్ చేసి ఉదయాన్నే పరగడుపున తాగితే జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.

Tags:    

Similar News