Kidney Stone: కిడ్నీలో స్టోన్స్‌ ఉంటే వీటికి దూరంగా ఉండాల్సిందే..!

Kidney Stone: కిడ్నీలో స్టోన్స్‌ ఉంటే వీటికి దూరంగా ఉండాల్సిందే..!

Update: 2022-09-09 02:40 GMT

Kidney Stone: కిడ్నీలో స్టోన్స్‌ ఉంటే వీటికి దూరంగా ఉండాల్సిందే..!

Kidney Stone: భారతదేశంలో రోజు రోజుకి కిడ్నీ స్టోన్ సమస్య పెరుగుతోంది. దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ సమస్యకి గురవుతున్నారు. కిడ్నీ మన శరీరంలో చాలా ముఖ్యమైన భాగం. దీని ప్రధాన విధి రక్తాన్ని ఫిల్టర్ చేయడం. ఈ ప్రక్రియ జరిగినప్పుడు కాల్షియం, సోడియం, అనేక రకాల ఖనిజాలవణాలు మూత్రాశయంలోకి చేరుతాయి. ఈ వస్తువుల పరిమాణం పెరగడం వల్ల కొన్ని రకాల స్టోన్స్‌ తయారవుతాయి. కిడ్నీలో రాళ్ల గురించి సమస్య ఉన్న వ్యక్తులు ఆహారంలో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ప్రమాదం మరింత పెరుగుతుంది.

1. విటమిన్ సి ఆహారాలు

రాళ్ల సమస్య ఉంటే విటమిన్ సి లభించే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే వీటివల్ల రాయి మరింత పెరగడం ప్రారంభమవుతుంది. నిమ్మ, బచ్చలికూర, నారింజ, కివీ, జామ వంటి వాటిని తినకూడదు.

2. శీతల పానీయాలు

మూత్రపిండాల్లో రాళ్ల సమస్య ఉంటే తరచుగా డీహైడ్రేషన్ సమస్యను ఎదుర్కొంటారు. ఈ పరిస్థితిలో కెఫీన్ శరీరానికి హానికరం. అందువల్ల శీతల పానీయాలు, టీ-కాఫీలు రోగులకు విషం కంటే తక్కువేమి కాదు. ఎందుకంటే వీటిలో కెఫిన్ చాలా ఎక్కువగా ఉంటుంది.

3. ఉప్పు

కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్న వ్యక్తులు ఉప్పుతో కూడిన పదార్థాల వినియోగాన్ని తగ్గించాలి. ఎందుకంటే వాటిలో సోడియం పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మూత్రపిండాలను దెబ్బతీస్తుంది.

4. నాన్ వెజ్ ఫుడ్స్

కిడ్నీ స్టోన్ పేషెంట్లకు మాంసం, చేపలు, గుడ్డు అస్సలు మంచివి కావు. ఎందుకంటే వీటిలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ సమయంలో ప్రొటీన్లు అంత ఎక్కువగా తీసుకోకూడదు.

Tags:    

Similar News