Health Tips: ఆస్తమా రోగులు చలికాలంలో వీటి జోలికి పోకూడదు.. చాలా డేంజర్..!

Health Tips: చలికాలంలో వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

Update: 2022-11-13 03:04 GMT

Health Tips: ఆస్తమా రోగులు చలికాలంలో వీటి జోలికి పోకూడదు.. చాలా డేంజర్..!

Health Tips: చలికాలంలో వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ సీజన్‌లో ఆస్తమా రోగుల సమస్యలు గణనీయంగా పెరుగుతాయి. చలి కారణంగా వారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే ఆస్తమా రోగుల శ్వాసనాళాలు వాచిపోతాయి. దీని కారణంగా రోగులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. ఈ సీజన్‌లో జలుబు-దగ్గు, ఫ్లూ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఆస్తమా రోగులు తమను తాము ప్రత్యేకంగా చూసుకోవాలి. శీతాకాలంలో కొన్ని ఆరోగ్యకరమైన వాటిని తీసుకోవాలి. అయితే కొన్ని ఆహారాలకి దూరంగా కూడా ఉండాలి. వాటి గురించి తెలుసుకుందాం.

పుల్లటి పదార్థాలు

ఆస్తమా రోగులు చల్లని, పుల్లని పదార్థాలు తినకూడదు. ఐస్ క్రీం, చల్లటి నీరు, నిమ్మకాయ, పచ్చి పెరుగు మొదలైన వాటిని తినడం వల్ల ఆస్తమా పెరుగుతుంది. దగ్గు సమస్య కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఆస్తమా రోగి ఈ ఆహారాలకి దూరంగా ఉండాలి.

టీ, కాఫీ

చలికాలంలో చాలా మంది టీ-కాఫీ తీసుకుంటారు. ఒక కప్పు టీ లేదా కాఫీ శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తుంది. అయితే ఆస్తమా రోగులు ఎక్కువగా టీ లేదా కాఫీని తాగకూడదు. ఎందుకంటే ఇవి సమస్యను మరింత పెంచుతుంది. నిజానికి టీ, కాఫీ తాగడం వల్ల గ్యాస్ సమస్య ఏర్పడుతుంది. ఇది ఆస్తమా అటాక్ ప్రమాదాన్ని పెంచుతుంది.

ప్రిజర్వేటివ్‌లు

ఆస్తమా రోగులు ప్రిజర్వేటివ్‌లను ఉపయోగించిన వాటిని తినకూడదు. పచ్చళ్లు, చాలాకాలం క్రితం వండిన వంటకాలు ఆస్తమా రోగుల కష్టాన్ని పెంచుతాయి.

Tags:    

Similar News