Health Tips: యూరిక్ యాసిడ్ కారణంగా కీళ్లనొప్పులు.. ఈ గ్రీన్ జ్యూస్ తాగితే ఉపశమనం..!
Health Tips: యూరిక్ యాసిడ్ కారణంగా కీళ్లనొప్పులు.. ఈ గ్రీన్ జ్యూస్ తాగితే ఉపశమనం..!
Health Tips: ఈ రోజుల్లో యూరిక్ యాసిడ్ సమస్య సర్వసాధారణమైపోయింది. దీనికి అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పేలవమైన జీవనశైలి కారణమని చెప్పవచ్చు. యూరిక్ యాసిడ్ అనేది ఒక రకమైన శారీరక రుగ్మత. దీనివల్ల కీళ్ల నొప్పులు, నడకలో ఇబ్బంది, పాదాల వాపు వంటి అనేక సమస్యలు ఏర్పడుతాయి. అయితే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే ఈ సమస్యను అధిగమించవచ్చు. రోజూ ఆహారంలో సొరకాయ రసం తీసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది.
సొరకాయలో విటమిన్ బి, విటమిన్ సి, ఐరన్ వంటి అనేక పోషకాలు ఉంటాయి ఈ కూరగాయ రసం తాగితే యూరిక్ యాసిడ్ నియంత్రణలో ఉంటుంది. దీని కోసం తాజా సొరకాయని పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి గ్రైండర్లో జ్యూస్ పట్టాలి. ఇందులో కొద్దిగా నల్ల ఉప్పు కలిపి రోజూ ఉదయం తాగితే కీళ్ల నొప్పులు, ఎముకల వాపు నుంచి ఉపశమనం లభిస్తుంది.
1. మధుమేహ వ్యాధి నియంత్రిస్తుంది
మధుమేహ వ్యాధిగ్రస్తులు సొరకాయ రసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిని చాలా వరకు నియంత్రించడంలో సహాయపడుతుంది.
2. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పరిమాణం పెరిగినప్పుడు అధిక రక్తపోటు, గుండెపోటు, కరోనరీ ఆర్టరీ వ్యాధి ప్రమాదం పెరుగుతుంది. దీనిని నివారించడానికి క్రమం తప్పకుండా సొరకాయ రసం తాగాలి.
3. బరువు తగ్గుతారు
బరువు పెరగడం అనేది ప్రస్తుత కాలంలో పెద్ద సమస్యగా మారింది. ఈ పరిస్థితిలో సొరకాయ రసం మీ నడుము, పొట్ట కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. ఎందుకంటే ఈ కూరగాయలలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి.