Women Health: మహిళలకు అలర్ట్.. డాక్టర్ సలహా లేకుండా గర్భనిరోధక మాత్రలు వాడుతున్నారా..!
Women Health: నేటి రోజుల్లో మహిళలు చాలా వ్యాధులకు గురవుతున్నారు. అందులో ఒకటి గర్భాశయ క్యాన్సర్. ప్రపంచ వ్యాప్తంగా ఈ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.
Women Health: నేటి రోజుల్లో మహిళలు చాలా వ్యాధులకు గురవుతున్నారు. అందులో ఒకటి గర్భాశయ క్యాన్సర్. ప్రపంచ వ్యాప్తంగా ఈ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.గర్భాశయ క్యాన్సర్ రోగుల విషయంలో భారతదేశం ఐదో స్థానంలో ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదిక ప్రకారం.. దేశంలో ప్రతి సంవత్సరం 1.23 లక్షల గర్భాశయ క్యాన్సర్ కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ క్యాన్సర్‌తో ఏటా 60 వేల మంది మహిళలు చనిపోతున్నారు. గర్భాశయ క్యాన్సర్ స్త్రీలలో గర్భాశయంలో సంభవిస్తుంది. చాలా మంది మహిళలకు ఈ క్యాన్సర్ గురించి తెలియదు. అందుకే దీని కేసులు చాలా వరకు చివరి దశలో కనిపిస్తాయి. అందుకే మహిళలు ఈ క్యాన్సర్ లక్షణాలు తెలుసుకుని జాగ్రత్తగా ఉండడం అవసరం.
గర్భాశయ క్యాన్సర్ లక్షణాలు
1. పీరియడ్స్ సమయానికి రాకపోవడం
2. పొత్తి కడుపులో నిరంతర నొప్పి
3. మెనోపాజ్ తర్వాత కూడా రక్తస్రావం
హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (HPV)
హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (HPV) వైరస్ వల్ల సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది. అయితే దీనివల్ల ప్రతి మహిళలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రాదు. కానీ బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న మహిళల్లో ఈ వైరస్ క్యాన్సర్‌కు కారణమవుతుంది. ఇప్పటికే తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న మహిళలు సులువుగా దీని బారిన పడుతారు. అందువల్ల క్యాన్సర్ లక్షణాలను ఎప్పుడూ విస్మరించకూడదు.
గర్భాశయ క్యాన్సర్ రావడానికి కారణాలు
1. అసురక్షిత సెక్స్
2. చాలా సిగరెట్లు తాగడం
3. మానసిక ఒత్తిడి వల్ల
4. మళ్లీ మళ్లీ గర్భం దాల్చడం
5. గర్భనిరోధక మాత్రలు వాడడం వల్ల
ఎలా రక్షించాలి
1. అసురక్షిత సెక్స్ చేయవద్దు
2. HPV వైరస్ ప్రమాదాన్ని నివారించడానికి టీకాలు వేయించుకోవాలి.
3. ఆహారం పట్ల శ్రద్ధ వహించాలి.
4. బరువును అదుపులో ఉంచుకోవాలి.
5. ధూమపానం చేయవద్దు
6. డాక్టర్ సలహా లేకుండా గర్భనిరోధక మాత్రలు వాడవద్దు.