Women Health: గర్భనిరోధక మాత్రలు అతిగా వాడుతున్నారా.. ఈ వ్యాధుల ప్రమాదం పొంచి ఉంది..!

Women Health: నేటి రోజుల్లో మహిళలు ఎక్కువగా గర్భనిరోధక మాత్రలు వాడుతున్నారు. ఇందులో చాలామంది డాక్టర్‌ సలహా లేకుండానే తీసుకుంటున్నారు.

Update: 2024-01-24 12:30 GMT

Women Health: గర్భనిరోధక మాత్రలు అతిగా వాడుతున్నారా.. ఈ వ్యాధుల ప్రమాదం పొంచి ఉంది..!

Women Health: నేటి రోజుల్లో మహిళలు ఎక్కువగా గర్భనిరోధక మాత్రలు వాడుతున్నారు. ఇందులో చాలామంది డాక్టర్‌ సలహా లేకుండానే తీసుకుంటున్నారు. దీనివల్ల భవిష్యత్‌లో చాలా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. మహిళల్లో గర్భనిరోధక మాత్రలు ఎక్కువగా వాడటం వల్ల సంతానలేమి సమస్య పెరుగుతోంది. ఆడపిల్లలు చిన్నవయసులో గర్భనిరోధక మాత్రలు ఎక్కువగా వాడడం వల్ల భవిష్యత్‌లో గర్భం దాల్చడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తర్వాత ఐవీఎఫ్ వంటి పద్ధతులను ఆశ్రయించాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి గర్భనిరోధక మాత్రల వినియోగం ఆలోచనాత్మకంగా చేయాలి.

గర్భాశయ క్యాన్సర్ సమస్య

రొమ్ము క్యాన్సర్ తర్వాత మహిళల్లో అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్. ఇది సంభవించడానికి ప్రధాన కారణాలలో గర్భనిరోధక మాత్రల వినియోగం ఒకటి. చిన్న వయస్సులో స్త్రీలు గర్భనిరోధకాలు ఉపయోగించడం వల్ల గర్భాశయ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. ఈ ప్రమాదాన్ని నివారించడానికి బాలికలు 9 నుంచి 14 సంవత్సరాల వయస్సులో HPV టీకాను పొందాలి.

మూత్రపిండాల సమస్య

గర్భనిరోధక మాత్రలు వాడితే కిడ్నీలపై చెడు ప్రభావం పడుతుందని కిడ్నీ పాడయ్యే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి గర్భనిరోధక మాత్రలు ఎక్కువగా వాడకూడదు. ఏదైనా ఔషధం డాక్టర్ సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి లేదంటే మందులు హాని కలిగిస్తాయి.

స్థూలకాయాన్ని పెంచుతాయి

గర్భనిరోధక మాత్రల దుష్ప్రభావాల గురించి మాట్లాడినట్లయితే వీటిలో స్థూలకాయం కూడా ఉంటుంది. దీనిని నిరంతరాయంగా ఉపయోగించడం వల్ల హార్మోన్లలో మార్పులు సంభవిస్తాయి. దీంతో బరువు పెరిగే సమస్య మహిళల్లో కనిపిస్తుంది. ఊబకాయం భవిష్యత్‌లో అనేక ఇతర సమస్యలను కలిగిస్తుంది.

Tags:    

Similar News