Health Tips: జలుబు, దగ్గు, గొంతునొప్పికి తక్షణ ఉపశమనం..!

* జలుబు, దగ్గు, గొంతునొప్పికి తక్షణ ఉపశమనం..!

Update: 2022-11-11 05:42 GMT

జలుబు, దగ్గు, గొంతునొప్పికి తక్షణ ఉపశమనం

Health Tips: వాతావరణం మారిపోయింది. చాలామంది జలుబు, దగ్గు, గొంతునొప్పితో ఇబ్బంది పడుతున్నారు. అయితే వీటిని నివారించడానికి ఉత్తమ మార్గం రోగనిరోధక శక్తిని పెంచుకోవడమే. శరీరంలో ఇది బలహీనంగా ఉంటే మళ్లీ మళ్లీ అనారోగ్యానికి గురవుతారు. ఈ పరిస్థితిలో మీరు చింతించాల్సిన పనిలేదు. కొన్ని చిట్కాలు పాటించి వీటిని సులభంగా నివారించవచ్చు. వాటి గురించి తెలుసుకుందాం.

పసుపు, అల్లంపొడి మిశ్రమం

జలుబు, దగ్గు నుంచి ఉపశమనం పొందడానికి ఒక టీస్పూన్ పసుపును తీసుకొని అందులో అర టీస్పూన్ అల్లం పొడిని కలపాలి. ఇప్పుడు దానికి ఒక చెంచా తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు రెండుసార్లు తీసుకుంటే సరిపోతుంది. ఇది తినడానికి ఒక గంట ముందు తిన్న తర్వాత ఒక గంట తర్వాత తీసుకోవాలి. అయితే ఈ మిశ్రమం తీసుకున్న తర్వాత నీరు తాగకూడదు.

నీటి ఆవిరి

జలుబుతో బాధపడుతున్న వ్యక్తులు ఆవిరి పీల్చుకుంటే తొందరగా కోలుకుంటారు. వేడినీటిలో వావిలి,యూకలిప్టస్ లాంటి కొన్నిరకాల ఆయుర్వేద ఆకులని మరిగించి ఆ నీటిని ఆవిరి పట్టాలి. పొడి దగ్గు,జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది. రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే చాలా రిలాక్స్‌గా ఉంటుంది.

చల్లటి పానీయాలు వద్దు

మీరు జలుబు,దగ్గుతో బాధపడుతున్నట్లయితే చల్లని పానీయాలు తాగకూడదు. దీంతో పాటు పెరుగు, ఐస్ క్రీం, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ తినకూడదు. అంతే కాకుండా రాత్రి పూట ఆలస్యంగా నిద్రపోకూడదు. ఇలా చేయడం వల్ల గొంతు నొప్పి, దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు.

Tags:    

Similar News