Stomach Problems: తరచుగా ఉదర సమస్యలకి గురవుతున్నారా.. అయితే ఇవి డైట్‌లో లేనట్లే..!

Stomach Problems: వేసవిలో చాలా మందికి జీర్ణక్రియకి సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి.

Update: 2023-05-17 03:53 GMT

Stomach Problems: తరచుగా ఉదర సమస్యలకి గురవుతున్నారా.. అయితే ఇవి డైట్‌లో లేనట్లే..!

Stomach Problems: వేసవిలో చాలా మందికి జీర్ణక్రియకి సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి. శరీరంలో సరిపడ నీరు లేకపోవడం వల్ల కడుపులో ఆమ్లత్వం పెరిగి జీర్ణ సమస్యలు వస్తాయి. అంతే కాకుండా ఆహారంలో పీచుపదార్థాలు లేకపోవడం, జంక్ ఫుడ్స్ తినడం, తిన్న వెంటనే నిద్రపోవడం వల్ల కూడా ఈ తరహా సమస్యలు ఎదురవుతాయి. వేసవిలో అజీర్తిని నివారించడానికి కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి అజీర్ణం నుంచి మిమ్మల్ని కాపాడుతాయి. జీర్ణక్రియ సజావుగా సాగేటట్లు చేస్తాయి. శరీరానికి అనేక ఇతర ప్రయోజనాలను అందిస్తాయి. అయితే డైట్‌లో ఏయే ఆహారాలను చేర్చుకోవాలో ఈరోజు తెలుసుకుందాం.

క్వినోవా

టైప్ 2 డయాబెటిస్‌ను నియంత్రించడంలో క్వినోవా సూపర్‌గా పనిచేస్తుంది. ఇది అజీర్తి సమస్యను నయం చేస్తుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది సులభంగా జీర్ణమవుతుంది. ఇది పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

ఆకు కూరలు

ప్రతిరోజు ఆకు కూరలు తీసుకోవచ్చు. వీటిలో బచ్చలికూర, కాలే, క్యాబేజీ, బ్రోకలీ, కాలీఫ్లవర్, పాలకూర వంటివి ఉంటాయి. ఈ కూరగాయలు సులభంగా జీర్ణమవుతాయి.

దోసకాయ

దోసకాయలో నీరు శాతం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇవి జీర్ణక్రియను సరిగ్గా ఉంచుతాయి. వేసవిలో శరీరాన్ని చల్లగా చేస్తాయి. దోసకాయను సలాడ్, స్మూతీ, జ్యూస్, డ్రింక్ రూపంలో తీసుకోవచ్చు.

పుచ్చకాయ

పుచ్చకాయ చాలా తీపిగా రుచికరంగా ఉంటుంది. ఇందులో దాదాపు 90 శాతం నీరు ఉంటుంది. ఇది మిమ్మల్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. ఇది జీర్ణక్రియని సరి చేస్తుంది. ఇది ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.

పెరుగు

పెరుగు ఒక ప్రోబయోటిక్స్. పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇవి పేగులకు మేలు చేస్తాయి. సమ్మర్ డైట్‌లో పెరుగును చేర్చుకోవచ్చు. ఇది మీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.

టొమాటో

టమోటాలలో చాలా నీరు ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. టొమాటోను కూర రూపంలో తీసుకోవచ్చు. దీన్ని సలాడ్, సూప్, జ్యూస్ లాగా కూడా తీసుకోవచ్చు. ఇది జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను దూరం చేస్తుంది.

Tags:    

Similar News