Weak Immunity: రోగనిరోధక శక్తి తగ్గితే వచ్చే సమస్యలు ఇవే..!

Weak Immunity: రోగనిరోధక శక్తి తగ్గితే వచ్చే సమస్యలు ఇవే..!

Update: 2022-09-22 16:00 GMT

Weak Immunity: రోగనిరోధక శక్తి తగ్గితే వచ్చే సమస్యలు ఇవే..!

Weak Immunity: కరోనా వచ్చినప్పటి నుంచి చాలామంది రోగనిరోధక శక్తిని పెంచుకోవడంపై దృష్టిపెట్టారు. ఇందుకోసం రకరకాల పద్ధతులని పాటిస్తున్నారు. శరీరంలో రోగనిరోధక శక్తి లేకుంటే అనేక ఇన్ఫెక్షన్లు, వ్యాధులకు గురికావాల్సి ఉంటుంది. సాధారణంగా ఈ రోజుల్లో చాలామంది చెడు అలవాట్ల వల్ల వారి ఆరోగ్యాన్ని వారే నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇమ్యూనిటీ అనేది చాలా ముఖ్యం. శరీరంలో ఇది లేకుంటే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వీటిని గమనించకుంటే చాలా ప్రమాదం జరుగుతుంది. అవేంటో తెలుసుకుందాం.

1. జలుబు, దగ్గు

రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటే ఎల్లప్పుడూ వ్యాధుల ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాతావరణంలో మార్పు వచ్చినప్పుడల్లా జలుబు, దగ్గు, కఫం లాంటివి ఏర్పడుతాయి. మందు వేసినా త్వరగా నయం కావు.

2. స్కిన్ ఇన్ఫెక్షన్లు

బలహీనమైన రోగనిరోధక శక్తితో బాధపడుతున్న వ్యక్తులు చర్మ వ్యాధులకి గురవుతారు. దీని కారణంగా న్యుమోనియా, స్కిన్ ఇన్ఫెక్షన్ ఏర్పడుతాయి.

3. కడుపులో ఆటంకాలు

రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నప్పుడు కడుపుకు సంబంధించిన సమస్యలు ఏర్పడుతాయి. ఈ పరిస్థితిలో వాంతులు, పొత్తికడుపు నొప్పి, మలబద్ధకం ఏర్పడుతాయి. కడుపు ఇన్ఫెక్షన్ ప్రమాదం చాలా రెట్లు పెరుగుతుంది ఎందుకంటే బాక్టీరియా సులభంగా మీ కడుపునకి చేరుకుంటుంది.

4. అలసటగా అనిపించడం

8 గంటలు నిద్రపోయినప్పటికీ రోజంతా అలసిపోయినట్లు అనిపిస్తుంది. ఆఫీసు పని చేయడం కష్టంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో రోగనిరోధక శక్తి చెడ్డ స్థితిలో ఉందని అర్థం.

Tags:    

Similar News