Sleeping Less At Night: రాత్రిపూట తక్కువగా నిద్రపోతున్నారా.. భారీ మూల్యం చెల్లించాల్సిందే..!

Sleeping Less At Night: ఈ రోజుల్లో చాలామంది రాత్రిపూట తక్కువగా నిద్రపోతున్నారు. ఇది చాలా ప్రమాదకరం. భవిష్యత్​లో చాలా ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Update: 2023-10-23 16:00 GMT

Sleeping Less At Night: రాత్రిపూట తక్కువగా నిద్రపోతున్నారా.. భారీ మూల్యం చెల్లించాల్సిందే..!

Sleeping Less At Night: ఈ రోజుల్లో చాలామంది రాత్రిపూట తక్కువగా నిద్రపోతున్నారు. ఇది చాలా ప్రమాదకరం. భవిష్యత్​లో చాలా ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ ఎఫెక్ట్ ఉద్యోగం, చదువులపై పడుతుంది. శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని కాపాడటంలో నిద్ర ముఖ్య పాత్ర పోషిస్తుంది. అలాంటి నిద్రని చాలామంది పట్టించుకోరు. వాస్తవానికి విటమిన్ల లోపం ఉంటే నిద్రపట్టదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం.

నిజానికి నిద్ర గొప్ప ఔషధం. దీనివల్ల శరీరం రిలాక్స్​తో పాటు రీఛార్జ్​ అవుతుంది. మంచి నిద్ర పోతున్న వ్యక్తులకు ఎలాంటి రోగాలు దరిచేరవు. కానీ నేటికాలంలో చాలామంది నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నారు. దీనికి కారణం విటమిన్ డి లోపం ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. దీని లోపం వల్ల నిద్రపోవాలని ప్రయత్నించినా నిద్ర పట్టదు. మంచి నిద్ర కోసం మెలటోనిన్ హార్మోన్ సరిపడంత ఉండాలి. శరీరంలో ఈ హార్మోన్ ఉత్పత్తికి విటమిన్ -డి ప్రధాన వనరు. శరరంలో విటమిన్-డి లోపించినప్పుడు నిద్ర హార్మోన్ ఉత్పత్తి కూడా తగ్గుతుంది. ఈ కారణంగా నిద్రలేమి సమస్య ఏర్పడుతుంది.

విటమిన్- డి లోపంతో పాటు మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. శరీరంలో సంతోషకరమైన హార్మోన్ల ఉత్పత్తి పెరిగితే శరీరం ఎక్కువగా ఒత్తిడికి లోనవుతుంది. ఈ కారణంగా నిద్రపట్టదు. నిద్రలేమి సమస్యను అధిగమించడానికి విటమిన్- డి అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలి. ఉదయం, సాయంత్రం సూర్యరశ్మిలో కొద్దిసేపు తిరగాలి. పుట్టగొడుగులు , గుడ్లు, సోయా మిల్క్, బాదం మిల్క్, నారింజ రసం, సముద్రపు ఉత్పత్తులు ఎక్కువగా తీసుకోవాలి. దీనితో పాటు ప్రతిరోజు వ్యాయామం, యోగా వంటివి అలవాటు చేసుకోవాలి. ప్రతిరోజు సరైన సమయంలో పడుకునే అలవాటు చేసుకోవాలి.

Tags:    

Similar News