Sleeping: రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోతున్నారా.. ఈ తప్పులు చేయకండి..
Sleeping: మనిషికి నిద్ర చాలా అవసరం. సరైన నిద్రలేకపోతే ఏ పనిచేయడం కుదరదు.
Sleeping: మనిషికి నిద్ర చాలా అవసరం. సరైన నిద్రలేకపోతే ఏ పనిచేయడం కుదరదు. దేనిపై దృష్టి సారించలేరు. చాలా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. రోజు కనీసం 7 నుంచి 8 గంటల పాటు నిద్రపోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలా చేయకపోతే ఆరోగ్యం దెబ్బతింటుందని వైద్యులు చెబుతున్నారు. చాలా మందికి సమయానికి నిద్ర రాదు. దీని వల్ల ఉదయం పూట అలసటగా అనిపిస్తుంది. భయపడాల్సిన అవసరం లేకపోయినా కొన్ని సులభమైన చర్యల ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
కొందరికి పగటిపూట నిద్రపోయే అలవాటు ఉంటుంది. దీని వల్ల రాత్రి చాలా ఆలస్యంగా నిద్రపోతారు. కొందరు రాత్రిపూట చీకటిలో కంప్యూటర్ లేదా మొబైల్ వాడతారు. దాని కాంతి కళ్లకు హానికరం ఇది నిద్రని తగ్గిస్తుంది. ఒక వ్యక్తి నిద్రలేమితో బాధపడుతున్నట్లయితే కార్బోహైడ్రేట్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం అవసరం. ఇది కాకుండా పిండి పదార్ధాలు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి.
నిద్ర లేమిని అధిగమించడానికి జీవనశైలిలో అవసరమైన మార్పులు చేయాలి. పగటిపూట ఎక్కువ నిద్ర పోకూడదు. ఎందుకంటే రాత్రి నిద్రపోవడం కష్టమవుతుంది. అవసరం అనిపిస్తే రోజులో అరగంట నిద్రిస్తే చాలు. మీకు మంచి నిద్ర కావాలంటే అది 15 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండాలి. అధిక ఉష్ణోగ్రత కారణంగా మీరు సమయానికి నిద్రపోవడంలో సమస్యలను ఎదుర్కొంటారు ఎందుకంటే ఇది శరీర వేడిని కూడా పెంచుతుంది. కొంతమందికి నిద్రపోయేటప్పుడు పదే పదే గడియారం వైపు చూసే అలవాటు ఉంటుంది. అలా చేస్తే వారి టెన్షన్ పెరుగుతుంది నిద్ర కూడా తగ్గుతుంది. అందుకే ఎప్పుడు సమయం చూసుకోకూడదు.