Late Night Sleep: రాత్రిపూట లేట్​గా నిద్రపోతున్నారా.. ఈ దుష్ప్రభావాలు తెలిస్తే షాక్​..!

Late Night Sleep: ఈ రోజుల్లో చాలామంది ఆలస్యంగా నిద్రపోవడం గ్రేట్​నెస్​గా ఫీలవుతున్నారు. కానీ వారికి తెలియదు భవిష్యత్​లో చాలా వ్యాధులను ఎదుర్కోవాల్సి వస్తోందని.

Update: 2023-10-11 16:00 GMT

Late Night Sleep: రాత్రిపూట లేట్​గా నిద్రపోతున్నారా.. ఈ దుష్ప్రభావాలు తెలిస్తే షాక్​..!

Late Night Sleep: ఈ రోజుల్లో చాలామంది ఆలస్యంగా నిద్రపోవడం గ్రేట్​నెస్​గా ఫీలవుతున్నారు. కానీ వారికి తెలియదు భవిష్యత్​లో చాలా వ్యాధులను ఎదుర్కోవాల్సి వస్తోందని. అవును మీరు విన్నది నిజమే.. లేట్​ నైట్​ నిద్రపోవడం వల్ల చాలా దుష్పలితాలు ఉన్నాయి. ఇవన్నీ ధీర్ఘకాలికంగా మిమ్మల్ని వేధిస్తాయి. కొంత మంది రాత్రి పూట మేల్కొని వర్క్‌ చేస్తుంటారు. ఇంకొంతమంది వినోదం కోసం సోషల్ మీడియాలో గంటల కొద్ది సమయం గడుపుతూ సినిమా-వెబ్ సిరీస్‌లను చూస్తారు. రాత్రి మేల్కొని ఉదయం నిద్రపోవడం వల్ల శరీరానికి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో ఈ రోజు తెలుసుకుందాం.

ప్రతిరోజూ రాత్రి 1-2 గంటలకు పడుకుంటే శరీరంలో జీవక్రియ రేటు తగ్గుతుంది. ఫలితంగా బరువు పెరిగే ప్రమాదం ఉంది. శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. అందుకే ఈరోజు నుంచి నిద్ర దినచర్యను మార్చుకోవడం అలవాటు చేసుకోండి. అలాగే ఆలస్యంగా నిద్రపోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. కొన్ని హార్మోన్లు శరీరం నుంచి ఉదయాన్నే విడుదలవుతాయి. ఇది మన గుండె జబ్బుల ప్రమాదాన్ని బాగా పెంచుతుంది. ఆరోగ్యంగా ఉండాలంటే రాత్రి 10 నుంచి 11 గంటల మధ్య నిద్రపోవడం అలవాటు చేసుకోవడం ఉత్తమం.

రాత్రి తొందరగా పడుకుని ఉదయం తొందరగా నిద్రలేవడం అన్న విధాల శ్రేయస్కరం. ప్రతి శరీరానికి ఒక సొంత టైమింగ్​ ఉంటుంది. దానికి బ్రేక్ పడితే చాలా ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మళ్లీ దాన్ని సెట్​ చేయడానికి చాలా సమయం పడుతుంది. రాత్రి చాలా సేపు మెలకువగా ఉండే వారికి రాత్రి పూట త్వరగా నిద్ర పట్టదు. దీంతో నిద్రలేమి, ఊబకాయం, గుండె జబ్బులు వంటి ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.

Tags:    

Similar News