Health Tips: యూరిక్ యాసిడ్తో అవస్థ పడుతున్నారా.. ఈ ఆకు వరం కంటే తక్కువేమి కాదు..!
Health Tips: ఈ రోజుల్లో చాలామంది యూరిక్యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారు. దీనివల్ల కీళ్లలో నొప్పులు ఏర్పడుతాయి.
Health Tips: ఈ రోజుల్లో చాలామంది యూరిక్యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారు. దీనివల్ల కీళ్లలో నొప్పులు ఏర్పడుతాయి. సరిగ్గా కూర్చోరాదు.. నిలకడగా ఏ పని చేయలేని పరిస్థితి ఎదురవుతుంది. మూత్రపిండాల్లోరాళ్లు, గౌట్ వంటి సమస్యలు తలెత్తుతాయి. శరీరంలో ఎక్కడపడితే అక్కడ వాపులు వస్తాయి. ఇలాంటి సమయంలో కచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి. అయితే అన్ని సమస్యలకు మందులే పరిష్కారం కాదు. కొన్నిటిని ఆయుర్వేద పద్దతుల ద్వారా, ఇంటి చిట్కాల పద్దతిలో తగ్గించుకోవచ్చు. యూరిక్ యాసిడ్ సమస్యకు ఒక ఆకుతో చెక్ పెట్టొచ్చు. దాని గురించి ఈ రోజు తెలుసుకుందాం.
వాస్తవానికి తమలపాకులో యూరిక్ యాసిడ్ లెవల్స్ తగ్గించే గుణాలున్నాయి. వైద్యుల సలహాలు, మెడిసిన్ తీసుకుంటూనే.. తమల పాకు చిట్కాలను పాటించవచ్చు. ఇలా చేయడం వల్ల యూరిక్ యాసిడ్ లెవల్స్ కంట్రోల్ లో ఉంటాయి. తమల పాకుతో ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. సరైన విధంగా ఉపయోగిస్తే బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు కూడా దూరమవుతాయి.
తమల పాకు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. క్రమం తప్పకుండా నమిలి తినడం వల్ల యూరిక్ యాసిడ్ సమస్యను అదుపులోకి తీసుకు రావచ్చు. రాత్రి పడుకునే ముందు ఒక గిన్నెలో నీళ్లు పోసి.. అందులో తమల పాకును ముక్కలు ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఈ నీటిని ఉదయం తాగడం వల్ల యూరిక్ యాసిడ్ లెవల్స్ తగ్గుతాయి. తమల పాకులను చిన్న గిన్నెలో వేసి ఒక గ్లాసు నీళ్లు పోసి ఐదు నిమిషాల పాటు మరిగించాలి. తర్వాత నీటిని గోరు వెచ్చగా ఉన్నప్పుడు తాగితే యూరిక్ యాసిడ్ స్థాయిలు తగ్గుతాయి.