Ramadan 2023: రంజాన్ మాసంలో ఉపవాసం ఉంటున్నారా.. ఈ మార్గాలని అనుసరిస్తే ఫిట్‌గా ఉంటారు..!
Ramadan 2023: రంజాన్ నెలని ముస్లింలు పవిత్రంగా భావిస్తారు.
Ramadan 2023: రంజాన్ నెలని ముస్లింలు పవిత్రంగా భావిస్తారు. అందుకే ప్రతి ఒక్కరు ఉపవాసం పాటిస్తారు. ఈ నెలలో సెహ్రీ, ఇఫ్తార్‌లకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ఉపవాస సమయంలో ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. లేదంటే ఆస్పత్రిపాలు కావాల్సి ఉంటుంది. అందుకే సెహ్రీ, ఇఫ్తార్‌లలో ఎలాంటి ఆహారాన్ని చేర్చుకోవాలో తెలుసుకోవడం ముఖ్యం. రంజాన్ సందర్భంగా ఆరోగ్యంగా ఉండేందుకు ఎలాంటి ఆహార చిట్కాలను పాటించాలో తెలుసుకుందాం.
హైడ్రేటెడ్ గా ఉండండి
సెహ్రీ, ఇఫ్తార్‌లలో నీరు అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోవాలి. ఇది మిమ్మల్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి సహాయపడుతుంది. శరీరం డీ హైడ్రేషన్‌కి గురికాకుండా కాపాడుతుంది. నీరు ఎక్కువగా తాగాలని గుర్తుంచుకోండి.
భారీ భోజనం
మీరు సెహ్రీలో పండ్లు, కూరగాయలు, శెనగలు, కాయధాన్యాలు మొదలైన వాటిని చేర్చుకోవచ్చు. ఈ ఆహారాలు ఎనర్జిటిక్‌గా ఉండటానికి సహాయపడతాయి. రోజంతా శక్తివంతంగా ఉంటారు. అలాగే సెహ్రీలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చవచ్చు. అవి మీకు శక్తిని అందించడానికి పని చేస్తాయి.
ఖర్జూరం
ఖర్జూరం సంప్రదాయకంగా ఉపవాసం విరమించడానికి తీసుకుంటారు. ఇది ఫైబర్‌కి అద్భుతమైన మూలం. అలాగే మాంసం, చేపలు, కొన్ని కూరగాయలను కూడా ఆహారంలో చేర్చుకోవచ్చు. దీనివల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు, ఇతర పోషకాలు లభిస్తాయి. అయితే అతిగా తినకూడదని గుర్తుంచుకోండి. నెమ్మదిగా తినడానికి ప్రయత్నించండి.
ఉ ప్పు
ఇఫ్తార్, సెహ్రీ మీల్స్‌లో ఉప్పు ఎక్కువగా ఉపయోగించవద్దు. ఇది చాలా అసౌకర్యంగా ఉంటుంది. దీనివల్ల మీకు జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. ఇది ఉబ్బరాన్ని కలిగిస్తుంది. అందుకే ఆహారంలో ఉప్పు ఎక్కువగా వాడకూడదు.
పెరుగు
పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇఫ్తార్ సమయంలో పెరుగును ఆహారంలో చేర్చుకోవచ్చు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మలబద్ధకం సమస్య నుంచి బయటపడటానికి పనిచేస్తుంది.