Idli Dosha at Night: ఇడ్లీ, దోశ అతిగా తింటున్నారా.. మరి ఈ విషయాలు తెలుసా..?
Idli Dosha at Night: ఇడ్లి, దోశ అంటే అందరు ఇష్టపడుతారు. ఏ సమయంలో పెట్టినా తినడానికి మొగ్గుచూపుతారు. ఎందుకంటే వాటి రుచి ఆ విధంగా ఉంటుంది.
Idli Dosha at Night: ఇడ్లి, దోశ అంటే అందరు ఇష్టపడుతారు. ఏ సమయంలో పెట్టినా తినడానికి మొగ్గుచూపుతారు. ఎందుకంటే వాటి రుచి ఆ విధంగా ఉంటుంది. అయితే ఇడ్లీ, దోశలని పులియబెట్టిన ఆహారాలుగా చెబుతారు. అప్పుడే వాటికి అద్భుత రుచి వస్తుంది. చాలా మందికి పులిసిన ఆహారం మీద ఇష్టం ఉంటుంది. కానీ ఇలాంటి ఆహారాలని రాత్రి పూట తినడం సరైందా కాదా అనే ప్రశ్న చాలా మందిలో మెదులుతుంటుంది. వాస్తవానికి పులియబెట్టిన ఆహారాలు జీర్ణశక్తిని పెంచి, రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతాయి. కానీ కొన్ని సర్వేల ప్రకారం పులిసిన ఆహారం తినడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని తేలింది. నిద్రపోయే ముందు పులిసిన ఆహారం తినవచ్చో లేదో ఈరోజు తెలుసుకుందాం.
పులిసిన ఆహారం
ఇడ్లీ, దోశలు మాత్రమే కాకుండా పులిసిన ఆహారాలు చాలా రకాలుగా లభిస్తాయి. కానీ ఎక్కువగా మాత్రం ఇవే ఉంటాయి. బియ్యం, పప్పులు నానబెట్టి మిక్సీ పట్టి పులిసిన పిండిని తయారు చేస్తారు. దీనిని చాలా రకాల ఆహారపదార్థాలు చేయడానికి వాడుతారు. పులియబెట్టిన ఆహారంలో ప్రొబయాటిక్స్ ఉంటాయి. వీటిలో బతికున్న బ్యాక్టీరియా ఉంటుంది. ఇవి పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
రాత్రి పూట తినొచ్చా?
నిపుణుల సలహా ప్రకారం ఉదయం లేదా మధ్యాహ్నం పూట మాత్రమే పులియబెట్టిన ఆహార పదార్థాలు తినాలి. రాత్రి పూట తినడం వల్ల డీ హైడ్రేషన్ సమస్య ఎదురవుతుంది. పులిసిన ఆహారం తిన్న వెంటనే కడుపులో వేడి పెరుగుతుంది. ఇది రాత్రి వేళల్లో మంచిది కాదు. నిద్రభంగం జరుగుతుంది. కొంతమందిలో కడుపులో అసౌకర్యం, బ్లోటింగ్ సమస్యలు ఏర్పడుతాయి. అందుకే నిద్రపోయే ముందు ఇలాంటి ఆహారాలు తీసుకోకపోవడం ఉత్తమం.
పులియబెట్టిన ఆహారం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నా కూడా కొంతమంది వాటికి దూరంగా ఉండటం అవసరం. కొన్ని రకాల పులిసిన ఆహారాలు అందరికీ పడకపోవచ్చు. కొంతమందిలో కొన్ని రియాక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి ఆహారాలేమైనా ఉంటే గుర్తించి వాటికి దూరంగా ఉండాలి. పులిసిన ఊరగాయల్లో సోడియం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో హైపర్ టెన్షన్ ఆరోగ్య సమస్యలున్నావారు జాగ్రత్తగా ఉండాలి. పులిసిన ఆహారం తిన్న వెంటనే కడుపునొప్పి సమస్యలు ఏర్పడితే కాస్త ఆలోచించాలి. కొన్ని రకాల ఉదర సమస్యలున్న వాళ్లు వీటికి దూరంగా ఉండాలి.