Health Tips: ఎండాకాలం గుడ్లు తింటున్నారా.. మరి ఈ విషయాలు గమనించారా..!

Health Tips: గుడ్డు ఒక సూపర్ ఫుడ్ దీనికి మించిన మరో పోషకమైన ఆహారం లేదు. అందకే ఆరోగ్య నిపుణులు ప్రతిరోజు ఒక గుడ్డు తినమని చెబుతారు.

Update: 2024-05-24 15:30 GMT

Health Tips: ఎండాకాలం గుడ్లు తింటున్నారా.. మరి ఈ విషయాలు గమనించారా..!

Health Tips: గుడ్డు ఒక సూపర్ ఫుడ్ దీనికి మించిన మరో పోషకమైన ఆహారం లేదు. అందకే ఆరోగ్య నిపుణులు ప్రతిరోజు ఒక గుడ్డు తినమని చెబుతారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ప్రతిరోజు గుడ్డు తినాలి. దీనివల్ల వారి శరీరం బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఇది శరీరానికి కనీస పోషకాహారాన్ని అందిస్తుంది. వేసవిలో వీటి అవసరం మరింత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఉక్కపోత వల్ల బాడీలోని పోషకాలన్నీ చెమట రూపంలో బయటికి వెళ్తాయి. ఇలాంటి సమయంలో వాటిని భర్తీ చేయడానికి కచ్చితంగా గుడ్లను డైట్లో చేర్చుకోవాలి. అయితే ఎండాకాలం గుడ్డు తినడం వల్ల కలిగే లాభాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

గుడ్డు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. గుడ్లలో అసంతృప్త కొవ్వులు ఉంటాయి. మోనోఅన్ శాచురేటెడ్, పాలీఅన్ శాచురేటెడ్ ఫ్యాట్స్ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. శరీరంలో చెడు కొవ్వును తగ్గిస్తాయి. గుడ్లలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. ఇవి ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతాయి. కాల్షియం శోషణను పెంచుతుంది. దీంతో ఎముకలు, కీళ్ల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. , బోలు ఎముకల వ్యాధి ఉన్నవారు గుడ్లు ఎక్కువగా తినాలి. దీనివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.

గుడ్లలో ప్రొటీన్ కంటెంట్ అధికంగా ఉంటుంది. కేలరీలు తక్కువగా ఉంటాయి. గుడ్డు తెల్లసొనలో 50శాతం ప్రొటీన్, పచ్చసొనలో 90శాతం కాల్షియం, ఐరన్ ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారు బ్రేక్ ఫాస్టులో గుడ్డు తింటే మధ్యాహ్న సమయంలో ఎక్కువగా ఆకలి వేయదు. పొట్ట ఎక్కువ సమయం నిండుగా ఉన్న భావన కలుగుతుంది. ఫలితంగా బరువు తగ్గుతారు. గర్బిణీలకు గుడ్లు చాలా మేలు చేస్తాయి. వీటిలో ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది పిండం ఎదుగుదలకు తోడ్పడుతుంది. పుట్టుకతో వచ్చే లోపాలను ఫోలిక్ యాసిడ్ నివారిస్తుంది. అందుకే గర్భీణిలు రెగ్యులర్ గా గుడ్లు తినడం అలవాటు చేసుకోవాలి.

Tags:    

Similar News