Health Tips: ఎనర్జీ డ్రింక్స్ అధికంగా తాగుతున్నారా.. ఈ సైడ్‌ఎఫెక్ట్స్ ఉంటాయి జాగ్రత్త..!
Health Tips: నేటికాలంలో ప్రజల జీవనశైలిలో చాలా మార్పులు వచ్చాయి.
Health Tips: నేటికాలంలో ప్రజల జీవనశైలిలో చాలా మార్పులు వచ్చాయి. చాలామంది ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నారు. ఇవి తాగిన వెంటనే శరీరానికి, మనస్సుకు ఉల్లాసంగా ఉంటుంది. మళ్ళీ మీ పనిలో నిమగ్నమై పోతారు. అయితే చాలా మంది రోజుకి రెండు మూడు బాటిళ్లు తాగుతూ వీటికి ఎడిక్ట్ అయిపోతున్నారు. ఎనర్జీ డ్రింక్స్ రుచిలో అద్భుతంగా ఉంటాయి కానీ అవి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. ఎనర్జీ డ్రింక్స్ తాగడం వల్ల కలిగే నష్టాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.
హైపర్ టెన్షన్
ఎనర్జీ డ్రింక్స్ అధికంగా తీసుకోవడం వల్ల హానికరం. దీన్ని తీసుకోవడం వల్ల హైపర్‌టెన్షన్ సమస్య ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే ఎనర్జీ డ్రింక్స్‌లో కెఫీన్ ఎక్కువగా ఉంటుంది. అధిక మొత్తంలో కెఫిన్ తీసుకోవడం వల్ల హృదయ స్పందన పెరుగుతుంది. దీని కారణంగా మీరు నాడీ సమస్యలని ఎదుర్కొంటారు. ఇది కాకుండా గుండెపోటు ప్రమాదం పెరుగుతుంది.
మధుమేహం
షుగర్ ఫ్రీ అని చెప్పుకునే అనేక ఎనర్జీ డ్రింక్స్ మార్కెట్‌లో ఉన్నాయి. అయితే ఎనర్జీ డ్రింక్స్ చేయడానికి చాలా చక్కెరను ఉపయోగిస్తారు. మీరు ఎనర్జీ డ్రింక్స్ ఎక్కువగా తీసుకుంటే శరీరంలోకి చక్కెర అధికంగా చేరుతుంది. దీని కారణంగా రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. మధుమేహం వంటి తీవ్రమైన వ్యాధి సంభవించే అవకాశం ఉంటుంది.
దంతాలకి దెబ్బ
శక్తి పానీయాల తయారీలో చక్కెరని ఎక్కువగా వాడుతారు. కానీ ఇవి దంతాలకు హానిచేస్తాయి. అందుకే ఎనర్జీ డ్రింక్స్ తాగడం అంత మంచిది కాదు. వీటికి దూరంగా ఉండటం వల్ల ఎలాంటి రోగాలు దరిచేరవు. వీటికి బదులు కొబ్బరినీరు, పళ్లరసాలు తాగితే ఆరోగ్యానికి ఉత్తమం.