Health Tips: అతిగా మద్యం తాగుతున్నారా.. లివర్ ని కాపాడుకోవాలంటే ఇదొక్కటే మార్గం..!

Health Tips: నేటి రోజుల్లో మద్యం తాగేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది.

Update: 2024-05-25 16:00 GMT

Health Tips: అతిగా మద్యం తాగుతున్నారా.. లివర్ ని కాపాడుకోవాలంటే ఇదొక్కటే మార్గం..!

Health Tips: నేటి రోజుల్లో మద్యం తాగేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. చిన్నా పెద్దా తేడాలేకుండా అందరూ దీనికి బానిసలుగా మారుతున్నారు. ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా మద్యం ఏరులై పారుతోంది. దీనివల్ల శరీరానికి నష్టం జరుగుతుందని తెలిసి కూడా తాగుతున్నారు. ప్రతిరోజు మద్యం తాగేవారి లివర్ ప్రమాదంలో పడుతుంది. దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే మద్యం మానుకోలేని వ్యక్తుల లివర్ కాపాడడానికి స్విట్జర్లాండ్ వ్యక్తులు ఒక జెల్ ని తయారుచేశారు. దీనిని తీసుకోవడం వల్ల లివర్ డ్యామేజ్ కాకుండా కాపాడుకోవచ్చు. దీని గురించి ఈరోజు తెలుసుకుందాం.

అతిగా మద్యం తాగినా ఆ ఎఫెక్ట్ లివర్ పై పడకుండా ఓ జెల్ ను స్విట్జర్లాండ్ సైంటిస్టులు తయారుచేశారు. దీన్ని ఇంటాక్సికెంట్ జెల్ అని పిలుస్తారు. ఇది పేగుల్లో ఒక పూతలా రక్షణ కవచంలా ఏర్పడి మందు ప్రభావాన్ని తగ్గిస్తుంది. సాధారణంగా మద్యం తాగినప్పుడు ఆ మద్యం కడుపులోకి చేరి పేగుల్లోని మ్యూకస్ మెంబ్రేన్ పొర ద్వారా రక్తంలో కలుస్తుంది. రక్తంలో కలిసిన అది కాలేయాన్ని చేరుకుంటుంది. ఇది తక్కువ సమయంలోనే లివర్ ను దెబ్బతీస్తుంది.

స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తలు కనుగొన్న ఈ జెల్ లో నానో ప్రొటీన్ లు ఉంటాయి కాబట్టి జీర్ణం కావడానికి కొంత సమయం తీసుకుంటుంది. మద్యం పేగుల్లోకి వచ్చి రక్తంలో కలిసే ప్రక్రియను ఈ జెల్ ఆలస్యం చేస్తుంది. మద్యం పేగుల్లోకి రాగానే ఈ జెల్ హైడ్రోజన్ పెరాక్సైడ్ ను విడుదల చేస్తుంది. దీంతో ఇది రక్తంలో కలిసి కాలేయాన్ని చేరినా దాని ఎఫెక్ట్ పెద్దగా ఉండదు. అయితే లిక్కర్ తాగకుండా ఉండలేని వారి కోసం మాత్రమే ఈ జెల్ అని స్పష్టం చేశారు. అంతేకానీ దీని సాయంతో ఇష్టమొచ్చిన రీతిగా మద్యం తాగేద్దామనుకుంటే కుదరదు.

Tags:    

Similar News