Eye Care Tips: కాంటాక్ట్‌ లెన్స్‌ అప్లై చేస్తున్నారా.. అయితే మీరు ప్రమాదంలో పడినట్లే..!

Eye Care Tips: కళ్లు చాలా సున్నితమైన అవయవాలు. కళ్లు లేకుంటే ఈ లోకాన్ని చూడటం సాధ్యం కాదు.

Update: 2022-08-01 06:30 GMT

Eye Care Tips: కాంటాక్ట్‌ లెన్స్‌ అప్లై చేస్తున్నారా.. అయితే మీరు ప్రమాదంలో పడినట్లే..!

Eye Care Tips: కళ్లు చాలా సున్నితమైన అవయవాలు. కళ్లు లేకుంటే ఈ లోకాన్ని చూడటం సాధ్యం కాదు. అందుకే వీటిని జాగ్రత్తగా చూసుకోవాలి. కళ్లపై చిన్న గాయం అయినా అది తీవ్రమైనదిగా పరిగణించాలి. ఈ రోజుల్లో ప్రజలు ఫ్యాషన్‌ కోసం కాంటాక్ట్ లెన్స్‌లను ధరిస్తున్నారు. ఇవి కళ్లకి తీవ్రమైన సమస్యలను కలిగిస్తాయి. కాంటాక్ట్ లేస్‌లను తీయడంలో, అప్లై చేయడంలో కొంచెం అజాగ్రత్త ఉంటే అంతే సంగతులు. ఇది కాకుండా ఎక్కువసేపు కాంటాక్ట్ లెన్స్‌లు ధరించడం వల్ల మీ కళ్ళకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. కాంటాక్ట్‌ లెన్స్‌ వల్ల కలిగే నష్టాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

కంటి వ్యాధుల ప్రమాదం

మీరు ఎక్కువసేపు కాంటాక్ట్ లెన్స్‌లు ధరించినట్లయితే అది మీ కళ్ళకు చికాకు కలిగిస్తాయి. కంటి ఇన్ఫెక్షన్లకు కారణం అవుతుంది. అస్పష్టమైన దృష్టి, కార్నియా సంబంధిత సమస్యలు ఏర్పడుతాయి. కాంటాక్ట్ లెన్స్‌లను అప్లై చేసిన తర్వాత కళ్లకి ఎరుపు సమస్య ఉంటే అది మీ కళ్ళకు హాని చేస్తుందని అర్థం చేసుకోవాలి. ఇది తగ్గకుండా అలాగే ఉంటే మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. లేదంటే కళ్లకి తీవ్ర నష్టం జరుగుతుంది.

కంటి పూతల సమస్య

మీరు కాంటాక్ట్ లెన్స్‌లను ఎక్కువసేపు ఉంచితే అది మీ కళ్ళలో అల్సర్‌లకు కారణం అవుతుంది. మీ కార్నియాపై తెల్లగా లేదా గోధుమ రంగులో గాయాలు అవుతాయి. ఇవి చాలా బాధాకరంగా ఉంటాయి. దీని కారణంగా కళ్ళు తెరవడం, మూయడం చాలా కష్టమవుతుంది. అందుకే కాంటాక్ట్‌ లెన్స్‌ తప్పనిసరి అయితేని వాడటం మంచిది. లేదంటే ప్రమాదం కొని తెచ్చుకున్నట్లు అవుతుంది.

Tags:    

Similar News