Benefits of Dates: రోగనిరోధక శక్తిని పెంచే ఖర్జూర పండు

Benefits of Dates: పండుఖర్జూర పండ్లు రోగనిరోధక శక్తిని పెంచుటలో ఎంతగానో ఉపయోగపడతాయి.

Update: 2021-04-27 09:27 GMT

ఖర్జురా (ఫైల్ ఇమేజ్)

Benefits of Dates: పిల్లలనుండి పెద్దలదాకా ఎంతో ఇష్టంగా తినే పండు ఖర్జూరాలు. చూడటానికి ఈతపండులా ఉండే ఖర్జూరం అందరికీ ప్రీతిపాత్రమే. ఖర్జూర పండు చాలా విలువైన ఔషధం మరియు శరీరానికి ఒక టానిక్ లా పనిచేస్తుంది. కర్జూరాలను స్టోర్ చేయడం చాలా సులభం. కర్జూరాలు మిగిలిన డ్రై ఫ్రూట్స్ కంటే ధర చాలా తక్కువ. ఈ కర్జూరాల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. మిగిలిన డ్రై ఫ్రూట్స్ తో పోల్చితే కర్జూరంలో అధిక ఎనర్జీ కలిగించే పోషకాలు, క్యాలరీలు మెండుగా ఉన్నాయి.

100 గ్రాముల కర్జూరంలో 280క్యాలరీలు అందుతాయి. అతి తేలికగా జీర్ణం అయిపోతుంది. శరీరానికి అవసరమైన శక్తినివ్వటానికి శరీరంలోని వ్యర్ధాలను తొలగించటానికి బాగా ఉపయోగపడుతుంది. ఖర్జూరంలో మెడిసినల్ విలువలు పుష్కలంగా ఉన్నాయి.ఇందులో ఫ్రక్టోజ్‌, డెక్స్‌ట్రోజ్‌ అనే చక్కెర పదార్థాలు ఎక్కువుగా ఉండటం వల్ల ఖర్జూరాలు ఎంతో మేలు చేస్తాయని న్యూట్రీషన్లు చెబుతున్నారు. మరిన్ని వివరాలను మన లైఫ్ స్టైల్ లో తెలుసుకుందాం.

ఖర్జూర పండ్లు విటమిన్ ఎ, బి లను కలిగి ఉంటాయి. ఈ రెండూ ఇందులో ఉండటం వలన ఇవి రోగనిరోధక శక్తిని పెంచుటలో ఎంతగానో ఉపయోగపడతాయి. పొటాషియం ఎక్కువగా లభించే ఖర్జూరాలు తినడం వల్ల గుండె కొట్టుకునే రేటు, రక్తపోటు అదుపులో వుంటాయి. అలాగే ఇవి గుండెకు సంబంధించిన అనేక సమస్యల నుంచి విముక్తి కలిగిస్తాయి.

ఈ పండు లో శరీరానికి కావాల్సిన మినరల్స్, ఇతర పోషకాలు అధికంగా టాయి. ఇవి శరీరంలోని కణాల ఎదుగుదలకు చాలా అవసరం. ఖర్జూరాలలో  కొలెస్ట్రాల్, క్యాలరీలు తక్కువగా, ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి.ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్ల రూపంలో ఉండే విటమిన్ ఎ కంటికి చాలా మంచింది.

క్యాల్షియం, మెగ్నీషియం, కాపర్ వంటి మినరల్స్ అధికంగా లభిస్తాయి. క్యాల్షియం ఎముకలను, దంతాలను ధృఢంగా ఉంచడానికి కాపర్ ఎర్రరక్త కణాల ఉత్పత్తికి, మాంగనీస్ ఎముకల పెరుగుదలకు ఉపయోగపడతాయి. మలబ్ధకంతో బాధపడే వారు కొన్ని ఖర్జూరాల్ని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే పరగడుపున వాటిని తిని, ఆ నీరు తాగితే మంచి ఫలితం ఉంటుంది.

డేట్స్ లో లో నేచురల్ షుగర్స్ ఉండటం వల్ల డయాబెటిక్ పేషంట్స్ కు ఇది ప్రకృతి ప్రసాధించిన ఒక వరం అని చెప్పవచ్చు. డయాబెటిక్ పేషంట్స్ డేట్స్ తినడం వల్ల షుగర్ లెవల్స్ లో ఎలాంటి మార్పులు ఉండవు. షుగర్ కంట్రోల్లోనే ఉంటుంది. అలాగే డయాబెటిస్ ఉన్నవారు వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల వారిలో స్వీట్స్ తినాలన్న కోరికను తగ్గిస్తుంది. అయితే ఇందులో ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉంటుంది. మితంగా తీసుకోవడం మంచిది.

మూత్రపిండాల్లో ఏర్పడిన రాళ్లు కరగాలంటే ఖర్చూరాల్ని తరచూ తినాలి. అలాగే కొంత మందికి మూత్రం సరిగ్గా రాకపోవడం, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, తదితర సమస్యలతో బాధపడేవారు ఈ పండును తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఖర్జూరలో రోగ నిరోధకశక్తి ని పెంచే గుణం మెండుగా ఉంటుంది. రకహీనతతో బాధపడుతున్నవారు, నీరసముగా ఉండేవారు, ఖర్జూర పండ్లు, పాలు, మీగడ లేదా కొద్దిగా నెయ్యి కలిపి ఉదయాన్నే అల్పాహారం గా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

ఖర్జూర పండ్లు విటమిన్ ఎ, బిలను కలిగి ఉంటాయి. ఈ రెండూ ఇందులో ఉండటం వలన ఇవి రోగనిరోధక శక్తిని పెంచుటలో ఎంతగానో ఉపయోగపడతాయి. ఎముకలు బలంగా, పటుత్వంగా ఉండాలంటే, ఖర్జూరపండు తరచుగా ఎక్కువగా తినాలి. ఖర్జూరపండు శరీరంలో అధికంగా గల వాతమున్ని పోగొడుతుంది.హ్యాంగోవర్ ను తగ్గించడంతో ఖర్జూరాలు బాగా ఉపయోగపడతాయి. తాగింది దిగాలంటే వీటిని తింటే మంచి ఫలితం ఉంటుందంట. చాలా మందికి ఈ విషయం తెలిసుండకపోవచ్చు.

రోజూ నానబెట్టిని డేట్స్ ను ఒకటి రెండు తినడం వల్ల ఇన్ స్టాంట్ ఎనర్జీ వస్తుంది. విటమిన్ సప్లిమెంట్ తీసుకునే అవకాశం ఉండదు. గ్లూకోజ్, ఫ్రక్టోజ్ వంటి నేచురల్ షుగర్స్ ఉండటం వల్ల ఇవి ఎనర్జీ లెవల్స్ ను మార్చుతుంది. త్వరగా మార్పు వస్తుంది. డేట్స్ లో సెలీనియం, మెగ్నీషియం, కాపర్, మరియు మెగ్నీషియంలు అధికంగా ఉన్నాయి. దంతాలను ఆరోగ్యంగా ఉంచే ఫోరిన్ మాత్రమే కాకుండా, ఐరన్ కూడా వీటిలో పుష్కలంగా ఉంటుంది.. ఐరన్ లోపంతో బాధపడే వారు వీటిని ఎక్కువగా తీసుకోవాలి.

డేట్స్ లో ఉండే విటమిన్ సి, డిలు స్కిన్ ఎలాసిటిని పెంచుతాయి. దాంతో చర్మం స్మూత్ గా మారుతుంది. చర్మ సమస్యలను నివారిస్తుంది. అసలే కరోనా ముప్పతిప్పలు పెడుతోంది. ఖర్జూరాలను మన రెగ్యులర్ డైట్ లో చేర్చుకుని రోగ నిరోధక శక్తి పెంచుకుంటూ కరోనాకు చెక్ పెట్టేద్దాం.

Tags:    

Similar News