Aloe Vera: అలోవెరా మంచిదే కానీ దుష్పలితాలు ఉంటాయని తెలుసా..?
Aloe Vera: కలబందలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఇది మన అందాన్ని మెరుగుపరచడంతో పాటు అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది.
Aloe Vera: కలబందలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఇది మన అందాన్ని మెరుగుపరచడంతో పాటు అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. కలబందను ఆయుర్వేదంలో ఔషధాల రారాజు అని పిలుస్తారు. అయితే దీనిని అధికంగా ఉపయోగిస్తే దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. కాబట్టి కలబంద ప్రయోజనాలు, అప్రయోజనాలు తెలిసి ఉండాలి.
కలబంద మొక్క చాలా ఇళ్లలో బాల్కనీలో కనిపిస్తుంది. కానీ కలబంద శరీరంలోని పోషకాల కొరతను తీరుస్తుందని మీకు తెలుసా. కలబంద రసం తీసుకోవడం ద్వారా రక్తంలో హిమోగ్లోబిన్ లోపం తీరుతుంది. ఇది కాకుండా పొడి చర్మం, ముడతలు, ముఖంపై మచ్చలను తొలగిస్తుంది. ఇందులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. కలబంద కళ్ల కింద నల్లటి వలయాలను తొలగించడంతో పాటు సైనస్‌లో ఉపశమనం కలిగిస్తుంది.
జుట్టు పెరుగుదలను పెంచడంలో కలబంద చాలా సహాయపడుతుంది. మీరు చుండ్రు సమస్యతో ఇబ్బంది పడుతుంటే కలబంద ఉపయోగించి వదిలించుకోవచ్చు. మీకు ఎక్కువ జుట్టు రాలుతున్నట్లయితే ఒకటి లేదా రెండు చెంచాల కలబంద జెల్‌ని షాంపూ లేదా కండీషనర్‌తో కలిపి వాడితే ప్రయోజనకరంగా ఉంటుంది. కలబంద యొక్క ప్రయోజనాలు చాలా ఉన్నాయి. కానీ దానిని ఎక్కువగా తీసుకోవడం హానికరం.
కలబందను ఎక్కువగా వాడటం వల్ల చర్మంపై దద్దుర్లు, దురదలు వస్తాయి. అలోవెరా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కానీ అధిక వినియోగం డీహైడ్రేషన్‌కు కారణమవుతుంది. కలబందను తరచుగా తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గుతుంది ఇది శరీరంలోని పొటాషియం మొత్తాన్ని తగ్గిస్తుంది. ఇది క్రమరహిత హృదయ స్పందన, శరీరంలో బలహీనతను కలిగిస్తుంది. అందువల్ల కలబందను అధికంగా వాడటం మంచిది కాదు.