Health Tips: యువతకు అలర్ట్‌.. గుండెపోటు నివారించాలంటే ఈ 4 అలవాట్లను వదిలేయండి..!

Health Tips: గతంలో యాబై ఏళ్ల వయసు దాటిన వారికి గుండెపోటు వంటి సమస్యలు వచ్చేవి. కానీ నేటి కాలంలో ఇరవై ఏళ్లవారికే వస్తున్నాయి. ముఖ్యంగా గుండెపోటు కారణంగా యువత చాలామంది చనిపోతున్నారు.

Update: 2023-10-13 16:00 GMT

Health Tips: యువతకు అలర్ట్‌.. గుండెపోటు నివారించాలంటే ఈ 4 అలవాట్లను వదిలేయండి..!

Health Tips: గతంలో యాబై ఏళ్ల వయసు దాటిన వారికి గుండెపోటు వంటి సమస్యలు వచ్చేవి. కానీ నేటి కాలంలో ఇరవై ఏళ్లవారికే వస్తున్నాయి. ముఖ్యంగా గుండెపోటు కారణంగా యువత చాలామంది చనిపోతున్నారు. నిజానికి చెడు కొలెస్ట్రాల్ సిరల్లో పేరుకుపోయినప్పుడు ఈ సమస్య ఎదురువుతుంది. మొదట బీపీ పెరుగుతుంది తరువాత గుండెపోటు వస్తుంది. దీన్ని నివారించడానికి అలవాట్లలో కొన్నింటిని మార్చుకోవాలి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

ఆరోగ్యకరమైన ఆహారం

మన గుండె ఆరోగ్యం మన తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. గుండెపోటును నివారించాలంటే ప్యాక్ చేసిన ఆహారం, ప్రాసెస్ చేసిన ఆహారం, చక్కెర, ఎర్ర మాంసం, వేయించిన వస్తువులను తినకూడదు. బదులుగా తృణధాన్యాలు, తాజా పండ్లు, కూరగాయలు, చేపల వంటి ఆరోగ్యకరమైన ఫుడ్స్‌ తీసుకోవాలి.

ధూమపానం, మద్యపానం మానేయండి

ఈ రోజుల్లో యువత సిగరెట్, మద్యపానానికి చాలా బానిసవుతున్నారు. దీని కారణంగా గుండె ఆరోగ్యం క్షీణిస్తుంది. ధూమపానం, మద్యపానం ఎంత త్వరగా మానేయగలిగితే అంత మంచిది. లేదంటే గుండె జబ్బుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

శారీరక శ్రమను పెంచండి

మీరు ఆఫీసులో కూర్చొని 8 నుంచి 10 గంటలు పని చేస్తే గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. చాలా సార్లు జిమ్‌కి వెళ్లే సమయం దొరకదు. మనం ఎంత బిజీగా ఉన్నా రోజుకు ఒక గంట వ్యాయామానికి తప్పనిసరిగా కేటాయించాలి. కావాలంటే మెట్లు ఎక్కడం, వాకింగ్ చేయడం లాంటివి చేయవచ్చు. శారీరక శ్రమను ఎంత ఎక్కువగా పెంచుకుంటే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం అంత తక్కువగా ఉంటుంది.

టెన్షన్ వద్దు

చదువుల నుంచి పని వరకు టెన్షన్‌ వల్ల ఒక వ్యక్తి చాలా ఒత్తిడికి గురవుతాడు. మీరు గుండెపోటు ప్రమాదాన్ని నివారించాలంటే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండే అలవాటును పెంచుకోండి. అనవసరమైన ఆలోచనలకు దూరంగా ఉండండి.

Tags:    

Similar News