Women Health: మహిళలకు అలర్ట్‌.. ఆడవారికి ఎక్కువగా వచ్చే క్యాన్సర్లు ఇవే..!

Women Health: ఆధునిక కాలంలో మహిళలు కుటుంబ పోషణ, ఉద్యోగం చేయడం లాంటి పనులు చేస్తూ తమ ఆరోగ్యం గురించి పూర్తిగా మరిచిపోతున్నారు.

Update: 2024-04-23 15:30 GMT

Women Health: మహిళలకు అలర్ట్‌.. ఆడవారికి ఎక్కువగా వచ్చే క్యాన్సర్లు ఇవే..!

Women Health: ఆధునిక కాలంలో మహిళలు కుటుంబ పోషణ, ఉద్యోగం చేయడం లాంటి పనులు చేస్తూ తమ ఆరోగ్యం గురించి పూర్తిగా మరిచిపోతున్నారు. ఉదయం నిద్రలేచిన నుంచి ఇంట్లో పనిచేయడం తర్వాత ఆఫీసుకు వెళ్లి అక్కడ పనిచేయడం వల్ల మానసికింగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు తీవ్రమైన క్యాన్లర్ల బారిన పడుతున్నారు. వీటిని ఆలస్యంగా తెలుసుకోవడం వల్ల చాలామంది చనిపోతున్నారు. ఈ రోజు మహిళల్లో అధికంగా వచ్చే క్యాన్సర్ల గురించి తెలుసుకుందాం.

ఆడవాళ్లలో బ్రెస్ట్, సర్విక్స్, ఒవేరియన్ ఈ మూడు క్యాన్సర్లు ఎక్కువగా వస్తున్నాయి. బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి రెండు కారణాలు ఉన్నాయి. వాటిలో ఒకటి జన్యుపరంగా, రెండోది సరైన ఆహారం తినకపోవడం. పిల్లలు కలగకపోవడం, ఆలస్యంగా కలిగిన వాళ్లలో ఈ క్యాన్సర్ రిస్క్ ఉంటుంది. ఈ కారణాలకు తోడు పొల్యూషన్ కూడా బ్రెస్ట్ క్యాన్సర్‌కు కారణమవుతోంది. అయితే దీనిని గుర్తించడం చాలా ఈజీ. బ్రెస్ట్ లో గడ్డలు ఉన్నట్లయితే వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి.

రెండోది ఒవేరియన్ క్యాన్సర్ ఇది ఇన్ఫెర్టిలిటీ వల్ల వస్తుంది. ప్రెగ్నెన్సీ లేటుగా రావడం, ప్రెగ్నెన్సీ కోసం చేసే ట్రీట్మెంట్ వల్ల ఓవరీస్ స్టిమ్యులేట్ అవుతాయి. దీనివల్ల కూడా ఒవేరియన్ క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. దీనిని డాక్టర్లు మాత్రమే గుర్తించగలరు. టీనేజర్స్ విషయానికి వస్తే క్యాన్సర్ సెల్స్ అగ్రెసివ్‌గా ఉంటాయి. కాబట్టి వెంటనే విపరీతంగా పెరిగే అవకాశాలు ఎక్కువ. కాబట్టి వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాలి.

మూడోది సర్వైకల్ క్యాన్సర్ ఇది హ్యూమన్ పాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే హెచ్పీవీ వ్యాక్సినేషన్ వేయించుకోవాలి. ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల వీనల్, వెజైనల్, తల, మెడ వంటి భాగాల్లో వచ్చే క్యాన్సర్లను కొన్నింటిని నివారించవచ్చు. సర్వైకల్ క్యాన్సర్ కనిపెట్టడానికి రెగ్యులర్గా పాప్స్మియర్ టెస్ట్ చేయించుకోవాలి. ఆ టెస్ట్‌లో క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయంటే ప్రి – క్యాన్సర్ స్టేజ్‌లోనే కనిపెట్టొచ్చు.

Tags:    

Similar News