Women Health: మహిళలకి అలర్ట్.. ఎక్కువ సేపు పనిచేస్తే ఈ సమస్యలు తప్పవు..
Women Health: నేటి కాలంలో స్త్రీలు అన్ని రంగాల్లో పురుషుల కంటే ముందున్నారు.
Women Health: నేటి కాలంలో స్త్రీలు అన్ని రంగాల్లో పురుషుల కంటే ముందున్నారు. ఇంట్లో మంచి గృహిణిగా బయట ఉద్యోగినిగా మల్టీ టాస్కింగ్ వర్క్ చేస్తుంటారు. ఉద్యోగం చేసి ఇంటికి వచ్చిన తర్వాత కూడా పని చేస్తారు. కానీ కొన్నిసార్లు ఎక్కువ పని చేయడం ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. ఎందుకంటే పనిభారం శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. దీని వల్ల మహిళలు ఆరోగ్యానికి సంబంధించిన నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఎక్కువ కాలం పనిచేసే మహిళలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారో తెలుసుకుందాం.
ఎక్కువ సేపు పనిచేయడం వల్ల మహిళల్లో పీరియడ్స్ సక్రమంగా రాదు. అధిక పని కారణంగా స్త్రీలలో క్రమరహిత పీరియడ్స్ రావొచ్చు. శారీరక, మానసిక ఆరోగ్యంతో హార్మోన్లు ముడిపడి ఉండటమే దీనికి కారణం. అందువల్ల ఆరోగ్యంగా ఉండాలనుకుంటే పని గంటలను తక్కువ చేసుకోవాలి. అవసరమైన గంటల కంటే ఎక్కువ పని చేయడం మానుకోవాలి. అంతేకాదు పెరిగిన పనిభారం కారణంగా స్త్రీలు చర్మం, జుట్టుకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటారు.
ఈ పరిస్థితిలో మీరు జుట్టు రాలే సమస్య నుంచి బయటపడాలనుకుంటే ఒత్తిడిని తగ్గించుకోండి. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించండి. ఇది కాకుండా మీ పని సమయాన్ని సరిదిద్దండి. మీ కోసం కూడా కొంత సమయం కేటాయించండి. చాలా మంది మహిళలు ఇంటి, ఆఫీసు పనిని నిర్వహిస్తారు. దీని కారణంగా వారు డిప్రెషన్ సమస్యలను కలిగి ఉంటారు. దీనివల్ల ఇతర శారీరక సమస్యలు రావచ్చు. మీరు డిప్రెషన్ లక్షణాలను చూసిన వెంటనే పని చేసే విధానాన్ని మార్చుకుంటే మంచిది.