Breast Cancer: మహిళలకి అలర్ట్.. ముందుగా వీటిని గమనిస్తే క్యాన్సర్‌ని జయించవచ్చు..!
Breast Cancer: ఈ రోజుల్లో చాలామంది మహిళలు రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నారు. దీనికి అవగాహన లోపమే కారణమవుతుంది.
Breast Cancer: ఈ రోజుల్లో చాలామంది మహిళలు రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నారు. దీనికి అవగాహన లోపమే కారణమవుతుంది. రొమ్ము క్యాన్సర్ అనేది రొమ్ములోని కణజాలంపై ప్రభావం చూపే క్యాన్సర్ రూపం. ఇది మహిళల్లో సంభవించే అత్యంత సాధారణమైన క్యాన్సర్ రకాల్లో ఒకటి. ప్రతీ ఎనిమిది మంది మహిళల్లో ఒకరు రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నారు. అయితే దీనిని సకాలంలో గుర్తిస్తే చికిత్స తీసుకోవడం సులభం అవుతుంది. దీంతో ప్రాణాలని కాపాడుకోవచ్చు. రొమ్ము క్యాన్సర్ లక్షణాలు, చికిత్స విధానాల గురించి ఈరోజు తెలుసుకుందాం.
రొమ్ము క్యాన్సర్ ప్రాథమిక లక్షణాలు
1. రొమ్ములో గడ్డలు ఏర్పడటం
2. రొమ్ము ఆకారం, పరిమాణంలో మార్పులు రావడం
3. చంకలో గడ్డలు ఏర్పడటం
4. రొమ్ము ప్రాంతంలో కొవ్వు, చర్మం మడతలు పడటం
ఈ లక్షణాలు గమనిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. 50 ఏళ్లు పైబడిన మహిళలు ప్రతి రెండేళ్లకోసారి మామోగ్రామ్ చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. రొమ్ము క్యాన్సర్ నిర్ధారించడానికి వైద్యులు కొన్ని పరీక్షలు చేస్తారు. వాటిలో మామోగ్రామ్, అల్ట్రాసౌండ్, MRI, బయాప్సీ ఉంటాయి. రొమ్ము క్యాన్సర్ చికిత్స అది ఏ దశలో ఉంటుందో దాన్ని బట్టి ఉంటుంది. రొమ్ము క్యాన్సర్‌కు సాధారణ చికిత్సలలో శస్త్రచికిత్స, కీమోథెరపీ , రేడియేషన్ థెరపీ ఉన్నాయి.
చాలా రకాల రొమ్ము క్యాన్సర్‌లకు శస్త్రచికిత్స చేసి రొమ్ము నుంచి క్యాన్సర్ కణజాలాన్ని తొలగిస్తారు. మిగిలిన క్యాన్సర్ కణాలను నాశనం చేయడానికి కీమోథెరపీ, రేడియేషన్ థెరపీలను ఉపయోగిస్తారు. శరీరం అంతటా క్యాన్సర్ కణాలను చంపడానికి కీమోథెరపీ చేస్తారు. కొన్ని రకాల రొమ్ము క్యాన్సర్‌లకు టార్గెటెడ్ థెరపీని ఉపయోగిస్తారు. అయితే రొమ్ము క్యాన్సర్‌ని ప్రారంభంలో గుర్తించినట్లయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా నయం చేయవచ్చు.