Pregnant Women: గర్భిణులకు అలర్ట్‌.. కేంద్రం అందించే ఈ బెనిఫిట్స్‌ పొందండి..!

Pregnant Women: కేంద్ర ప్రభుత్వమైనా, రాష్ట్ర ప్రభుత్వమైనా మహిళల కోసం చాలా స్కీమ్‌లను ప్రవేశపెడుతోంది.

Update: 2023-12-11 16:00 GMT

Pregnant Women: గర్భిణులకు అలర్ట్‌.. కేంద్రం అందించే ఈ బెనిఫిట్స్‌ పొందండి..!

Pregnant Women: కేంద్ర ప్రభుత్వమైనా, రాష్ట్ర ప్రభుత్వమైనా మహిళల కోసం చాలా స్కీమ్‌లను ప్రవేశపెడుతోంది. ఇవన్ని మహిళల అభ్యున్నతికి ఎంతగానో ఉపయోగపడుతాయి. ఈ రోజు అలాంటి ఒక పథకం గురించి తెలుసుకుందాం. ఇది గర్భిణులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతినెలా రూ.6 వేలు ఇస్తోంది. ఈ పథకం ప్రయోజనం కోసం ఏ విధంగా అప్లై చేసుకోవాలో ఈ రోజు తెలుసుకుందాం.

వాస్తవానికి గర్భిణుల కోసం మోదీ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ స్కీమ్‌ కింద ప్రభుత్వం రూ.6వేలు ఆర్థిక సాయం అందజేస్తోంది. ఈ సొమ్ము నేరుగా మహిళల బ్యాంకు ఖాతాల్లోకి చేరుతుంది. అర్హులైన మహిళల ఖాతాలకు మాత్రమే డబ్బులు వెళ్తాయి. పోషకాహార లోపంతో పిల్లలు పుట్టే సమస్యను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మాతృత్వ వందన యోజనను ప్రారంభించింది. ఈ పథకం ద్వారా గర్భిణులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తుంది.

పిల్లలు పుట్టక ముందు, పుట్టిన తర్వాత పిల్లల సంరక్షణకు వారికి వచ్చే వ్యాధుల నుంచి కాపాడేందుకు కేంద్రం రూ.6వేలు ఆర్థిక సాయం అందిస్తోంది. తద్వారా మహిళలు కనీసం మంచి ఆహారం తీసుకుంటారని దీని ఈ ఉద్దేశ్యం. మీరు ఈ పథకం ప్రయోజనాన్ని పొందాలంటే ముందుగా గర్భిణి వయస్సు 19 ఏళ్లు పైబడి ఉండాలని గుర్తుంచుకోండి. ఇంతకుంటే తక్కువగా ఉంటే ఈ స్కీమ్‌కు వారు అర్హులు కాదు. ఈ పథకం ప్రయోజనాలను పొందేందుకు అధికారిక వెబ్‌సైట్ https://wcd.nic.in/schemes/pradhan-mantri-matru-vandana-yojana కి వెళ్లాలి. ఇక్కడ పథకానికి సంబంధించిన సమాచారాన్ని పొందుతారు. ఇక్కడ నుంచి సాయం పొందలేకపోతే సమీపంలోని అంగన్‌వాడీని సంప్రదించి సమాచారం పొందవచ్చు. అలాగే అప్లై చేసుకోవచ్చు.

Tags:    

Similar News