Alert Pregnant Women: గర్భిణులకు అలర్ట్‌.. ఎసిడిటీ సమస్య మళ్లీ మళ్లీ వేధిస్తుందా..!

Alert Pregnant Women: గర్భం దాల్చడం ఏ మహిళకైనా ఒక అందమైన అనుభూతి. ఎందుకంటే ప్రతి మహిళ తన జీవితంలో తల్లి కావాలని కోరుకుంటుంది.

Update: 2023-10-17 16:00 GMT

Alert Pregnant Women: గర్భిణులకు అలర్ట్‌.. ఎసిడిటీ సమస్య మళ్లీ మళ్లీ వేధిస్తుందా..!

Alert Pregnant Women: గర్భం దాల్చడం ఏ మహిళకైనా ఒక అందమైన అనుభూతి. ఎందుకంటే ప్రతి మహిళ తన జీవితంలో తల్లి కావాలని కోరుకుంటుంది. అయితే గర్భం దాల్చే సమయం ఎంత సంతోషంగా ఉంటుందో ఒక్కోసారి అంతే కష్టంగా ఉంటుంది. తొమ్మిది నెలల పాటు బిడ్డను తన కడుపులో ఉంచుకుని తల్లి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటుంది. ఈ పరిస్థితిలో అందరు గర్భిణులు ఎసిడిటీ సమస్యను ఎదుర్కొంటారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం శరీరంలో ప్రొజెస్టెరాన్ హార్మోన్ స్థాయి పెరగడం వల్ల గ్యాస్ ఉత్పత్తి అవుతుంది.గర్భధారణ సమయంలో ఎసిడిటీ నొప్పి కొన్నిసార్లు భరించలేనిదిగా ఉంటుంది. అయితే కొన్ని హోం రెమెడీస్‌ని పాటించడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

తగినంత నీరు తాగడం

ప్రెగ్నెన్సీ సమయంలో ఎసిడిటీ సమస్య రాకుండా ఉండాలంటే తగిన మోతాదులో నీరు తాగడం అవసరం. రోజూ కనీసం మూడు లీటర్ల నీరు తాగాలని వైద్యులు చెబుతున్నారు. దీని వల్ల బిడ్డ కూడా ప్రయోజనం పొందుతాడు. అయితే నీళ్లు నిదానంగా తాగాలని గుర్తుంచుకోండి.

మెంతులు

గ్యాస్ సమస్యలో మెంతి గింజలు చాలా మేలు చేస్తాయి. ఈ హోం రెమెడీని ప్రాచీన కాలం నుంచి వాడుతున్నారు. మెంతి గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయాన్నే తాగడం వల్ల చాలా ప్రభావవంతంగా ఉంటుంది.

అల్లం, పుదీనా టీ

పుదీనా, అల్లం టీ తాగితే జీర్ణక్రియ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా ఈ పరిహారం ఎసిడిటీ సమస్యలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. అసిడిటీకి ఒత్తిడి కూడా కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గర్భధారణ సమయంలో ఒత్తిడికి దూరంగా ఉండాలి. గ్యాస్ సమస్యను వదిలించుకోవాలంటే టెన్షన్ ఫ్రీగా ఉండటం అవసరం.

Tags:    

Similar News