Pregnant Women: గర్భిణులకి అలర్ట్.. ఉప్పు విషయంలో జాగ్రత్త ఈ విషయాలు గమనించండి..!
Pregnant Women: గర్భిణులు ఉప్పు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. శరీరంలో ఇది ఎక్కువైనా, తక్కువైనా తీవ్ర పరిణామాలని ఎదుర్కోవాల్సి ఉంటుంది.
Pregnant Women: గర్భిణులు ఉప్పు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. శరీరంలో ఇది ఎక్కువైనా, తక్కువైనా తీవ్ర పరిణామాలని ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాస్తవానికి ఆరోగ్యానికి ఉప్పు చాలా ముఖ్యం. ఇందులో శరీరానికి అవసరమయ్యే సోడియం లభిస్తుంది. ఇది pH, ద్రవ స్థాయిలను సమతుల్యం చేస్తుంది. గర్భధారణ సమయంలో ఉప్పు తీసుకోవడం అవసరమే కానీ ఎక్కువ ఉప్పు తీసుకోవడం హానికరం. ప్రెగ్నెన్సీ సమయంలో ఉప్పు ఎంత మోతాదులో తీసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం.
ప్రెగ్నెన్సీ సమయంలో ఎంత ఉప్పు తినాలి?
గర్భధారణ సమయంలో ఉప్పు తీసుకోవాలి కానీ అది పరిమిత పరిమాణంలో మాత్రమే ఉండాలి. ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు రోజుకు 3.8 గ్రాముల ఉప్పు తీసుకోవాలి. 1 రోజులో 5.8 గ్రాముల ఉప్పు కంటే ఎక్కువ తీసుకోకూడదు. ఎందుకంటే ఇది ఆరోగ్య సమస్యలని కలిగిస్తుంది.
ఉప్పు వల్ల కలిగే ప్రయోజనాలు
1. గర్భధారణ సమయంలో శరీరంలో ఉప్పు లేకపోవడం వల్ల శరీరంలోని చాలా భాగాలు సరిగా పనిచేయవు. శరీరంలో బలహీనత, అలసట ఏర్పడుతుంది. దీని కారణంగా గర్భధారణ సమయంలో సమస్యలను ఎదుర్కొంటారు.
2. సోడియం శరీరంలో ద్రవాన్ని పెంచడంలో సహాయపడుతుంది. గర్భధారణ సమయంలో బేబి ఎదుగుదలకి ఇది దోహదం చేస్తుంది. శరీరంలో సోడియం కొరత ఉంటే ద్రవం కొరత ఏర్పడుతుందని గుర్తుంచుకోండి.
3. ఉప్పులో ఉండే సోడియం, అయోడిన్ శిశువు అభివృద్ధికి చాలా ముఖ్యమైనవి. లేదంటే ఎదుగుదల సరిగ్గా ఉండదు.
ఉప్పు తినడం వల్ల కలిగే నష్టాలు
1. ఉప్పును ఎక్కువగా తీసుకుంటే గర్భధారణ సమయంలో చేతులు, కాళ్ళు, ముఖం, మొదలైన వాటిలో వాపులు ఏర్పడుతాయి.
2. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు సమస్యలు ఎదురవుతాయి.
3. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల తరచుగా మూత్రవిసర్జన సమస్య వస్తుంది.