Alert For Men: 30 ఏళ్లు దాటిన పురుషులకు అలర్ట్.. ఇవి తీసుకోపోతే యాక్టివ్‌గా ఉండలేరు..!
Alert For Men: కుటుంబ బాధ్యతల కారణంగా చాలామంది పురుషులు వారి ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదు.
Alert For Men: కుటుంబ బాధ్యతల కారణంగా చాలామంది పురుషులు వారి ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదు. దీంతో చాలామంది రకరకాల వ్యాధులకు గురువుతున్నారు. దీనికి తోడు ఉద్యోగరీత్యా పని ఒత్తిడి, మానసిక ఆందోళనల కారణంగా చెడు అలవాట్లకు బానిసలవుతు న్నారు. నిజానికి 30 ఏళ్లు దాటిన పురుషులందరూ చాలా ప్రమాదంలో ఉన్నారు. ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. శరీరానికి అవసరమైన కొన్ని హార్మోన్లు, పోషకాల లో క్షీణత ఉంటుంది. అందువల్ల 30ఏళ్ల తర్వాత ప్రతి పురుషుడు తీసుకోవల్సిన కొన్ని విటమిన్ల గురించి ఈ రోజు తెలుసుకుందాం.
విటమిన్ డి
30 ఏళ్ల తర్వాత టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గుతాయి. ఇది కండరాల, శారీరక బలం స్థాయిలను ప్రభావితం చేస్తుంది. విటమిన్ డి టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచుతుంది. కాల్షియం శోషణలో సాయపడుతుంది. ఎముకల పటిష్టతకు కాల్షియం అవసరం. ఇది గుండె సమస్యలు, కొన్ని క్యాన్సర్ల నుంచి రక్షిస్తుంది.
మెగ్నీషియం
గుండె, కండరాల ఆరోగ్యానికి మెగ్నీషియం అవసరం. ఇది రక్తపోటు, చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. ఇది నిద్ర నాణ్యత, ఒత్తిడి మెయింటెన్, బరువు నియంత్రణను మెరుగుపరచడంలో సాయపడుతుంది. తద్వారా గుండె సంబంధిత వ్యాధులు తగ్గుతాయి.
జింక్
టెస్టోస్టెరాన్ స్థాయిలు, హార్మోన్ల సమతుల్యతకు ఇది అవసరం. 30 దాటిన తర్వాత జింక్ తీసుకోవాలి. ఇది టెస్టోస్టెరాన్‌ను ఈస్ట్రోజెన్‌గా మార్చడాన్ని నిరోధిస్తుంది. అంగస్తంభనను నివారిస్తుంది. గుల్లలు, గుమ్మడి గింజల్లో జింక్ అధికంగా లభిస్తుంది.
ఒమేగా 3
ఒమేగా -3 యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. గుండె, మెదడు,రక్త నాళాలకు కవచంగా పనిచేస్తుంది. ఇది కార్డియోవాస్కులర్ రిస్క్, ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది కొవ్వు చేపలు, సప్లిమెంట్ల ద్వారా పొందవచ్చు.
విటమిన్ కె
విటమిన్ కె రక్తం గడ్డకట్టడం, ఎముకల ఆరోగ్యానికి కీలకం. ఇది గాయాలను నయం చేయడానికి మాత్రమే కాదు అభిజ్ఞా పనితీరును మెరుగుపరుస్తుంది. వయస్సు-సంబంధిత జ్ఞాపకశక్తి నష్టాన్ని నివారిస్తుంది. ఈ పోషకాలు ఆకుపచ్చని కూరగాయలు, పండ్లు, నూనెలలో ఉంటాయి.