Men Health: పురుషులకి అలర్ట్.. ఈ క్యాన్సర్ వల్ల సంతాన సామర్థ్యంపై ఎఫెక్ట్..!
Men Health: ఈ రోజుల్లో పురుషులు ఉద్యోగ ఒత్తిడి, కుటుంబ బాధ్యతల వల్ల ఆరోగ్యాన్ని అస్సలు పట్టించుకోవడం లేదు. దీంతో రకరకాల వ్యాధుల బారినపడుతున్నారు.
Men Health: ఈ రోజుల్లో పురుషులు ఉద్యోగ ఒత్తిడి, కుటుంబ బాధ్యతల వల్ల ఆరోగ్యాన్ని అస్సలు పట్టించుకోవడం లేదు. దీంతో రకరకాల వ్యాధుల బారినపడుతున్నారు. ముఖ్యంగా 15 నుంచి 45 సంవత్సరాల పురుషులు ఎక్కువగా వృషణాల క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. దీనివల్ల సంతాన సామర్థ్యం దెబ్బతింటుంది. ఇతర క్యాన్సర్ల మాదిరిగానే ఈ క్యాన్సర్ కూడా ప్రారంభంలో అనేక సంకేతాలను ఇస్తుంది. వీటిని గుర్తించినట్లయితే ఈ వ్యాధిని నివారించవచ్చు. ఈ క్యాన్సర్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
వైద్యుల ప్రకారం ఈ రకమైన క్యాన్సర్ పురుషుల వృషణాలలో మొదలవుతుంది. వాస్తవానికి వృషణాలలో స్పెర్మ్, టెస్టోస్టెరాన్ ఉత్పత్తి అవుతాయి. ఈ క్యాన్సర్‌ను వైద్య పరిభాషలో టెస్టిక్యులర్ క్యాన్సర్ అని పిలుస్తారు. 15 నుంచి 45 సంవత్సరాల మధ్య పురుషులలో ఈ క్యాన్సర్ ప్రమాదం ఎక్కువగా ఉందని వైద్యులు చెబుతున్నారు. వృషణంలో వాపు లేదా గడ్డలు ఈ క్యాన్సర్ మొదటి లక్షణంగా చెప్పవచ్చు. దీనికి సకాలంలో చికిత్స అందించకపోతే శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తుంది. తర్వాత దీనిని అదుపు చేయడం చాలా కష్టం అవుతుంది. ఇతర లక్షణాలు వెన్నునొప్పి, పొత్తికడుపులో నొప్పి, రొమ్ము కణజాలం విస్తరించడం, రెండు వృషణాలలో వాపు లేదా గడ్డలు ఏర్పడటం జరుగుతుంది.
వృషణ క్యాన్సర్ కారణాలు
వైద్యుల ప్రకారం పురుషులలో వృషణ క్యాన్సర్‌కి ఖచ్చితమైన కారణం తెలియలేదు. అయితే కుటుంబంలో ఎవరికైనా ఇంతకుముందు ఈ వ్యాధి ఉంటే తరువాతి తరంలో దీని ప్రమాదం పెరుగుతుంది. స్నానం చేసే సమయంలో ఈ వ్యాధి గురించి తెలుసుకోవచ్చు. క్యాన్సర్‌తో కూడిన కణితులు సాధారణంగా నొప్పిని కలిగించవని గుర్తుంచుకోండి. ఇందులో ఏర్పడిన గడ్డని నొక్కినప్పుడు నొప్పి లేనట్లయితే అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. వెంటనే వైద్యుడిని సంప్రదించి పరీక్ష చేయించుకోవాలి. తద్వారా భవిష్యత్‌లో ఏర్పడే ఇబ్బందులను నివారించవచ్చు.