Men Depression: పురుషులకి అలర్ట్..జీవనశైలిలో మార్పులు చేయకుంటే డిప్రెషన్‌లోకి..!
Men Depression: పురుషులకి అలర్ట్..జీవనశైలిలో మార్పులు చేయకుంటే డిప్రెషన్‌లోకి..!
Men Depression: ప్రతి ఇంట్లో పురుషులు కుటుంబ బాధ్యతలని నిర్వహిస్తారు. ఈ బాధ్యతల మధ్య వారు తమను తాము పట్టించుకోవడం మర్చిపోతారు. కొన్నిసార్లు జీవితంలో బిజీగా మారడం వల్ల నిరాశ, నిస్పృహలకి గురవుతారు. డిప్రెషన్ కారణంగా ఒక వ్యక్తి సరిగ్గా నిద్రపోలేడు. ఆకలి తక్కువగా ఉందని అవసరానికి మించి తినడం ప్రారంభిస్తాడు. అంతేకాదు డిప్రెషన్ కారణంగా మనిషికి ఏ పనీ చేయాలో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో పురుషులు జీవనశైలిలో తప్పనిసరిగా కొన్ని మార్పులు చేసుకోవాలి. దీనివల్ల డిప్రెషన్ బారిన పడకుండా ఉంటారు. వాటి గురించి తెలుసుకుందాం.
నో చెప్పడం
ముఖ్యంగా మానసిక సమస్యల వల్ల చాలామంది డిప్రెషన్‌లోకి వెళుతారు.
కొన్నిసార్లు పని ఒత్తిడి కారణంగా డిప్రెషన్‌కు గురవుతారు. కాబట్టి ఒత్తిడిని నివారించడానికి నో చెప్పడం నేర్చుకోవాలి. ఎందుకంటే పురుషులు కొన్నిసార్లు ఇతరుల పనిని కూడా చేయడానికి ప్రయత్నిస్తారు. ఇది డిప్రెషన్‌కు కారణం అవుతుంది. కాబట్టి ఈ అలవాటును మానుకోవడం ఉత్తమం.
శ్రద్ధ వహించాలి
కుటుంబ బాధ్యతను నెరవేర్చే పనిలో పురుషులు తమను తాము పట్టించుకోరు. దీంతో అతను సరిగ్గా నిద్రపోడు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోడు. క్రమంగా డిప్రెషన్‌కు గురవుతారు. అందుకే పురుషులు తమను తాము జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే మీ గురించి శ్రద్ధ వహిస్తే మానసిక స్థితి బాగుంటుంది. లేదంటే ఏపని చేయలేరు.
కుటుంబంతో సమయం గడపండి
చాలా సార్లు పురుషులు కొన్ని పనుల కారణంగా కుటుంబానికి దూరంగా ఉంటారు. దీని కారణంగా పురుషులు ఒంటరిగా అనుభూతి చెందుతారు. నిరాశకు గురవుతారు. కాబట్టి వీలు దొరకినప్పుడల్లా కుటుంబంతో సమయాన్ని గడపండి. మీ వ్యక్తిగత విషయాలని వారితో షేర్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీరు మనసు తేలిక అవుతుంది. మీరు సంతోషంగా ఉంటారు.