మీ వంటకాలకి వీటిని జోడిస్తే రుచి మరింత రెట్టింపు.. అవేంటంటే..?

*మీ వంటకాలకి వీటిని జోడిస్తే రుచి మరింత రెట్టింపు.. అవేంటంటే..?

Update: 2022-07-12 13:30 GMT

మీ వంటకాలకి వీటిని జోడిస్తే రుచి మరింత రెట్టింపు.. అవేంటంటే..?

Kitchen Tips: భారతీయ వంటకాలలో మసాలాలకి ప్రత్యేక స్థానం ఉంది. ఇవి లేనిదే దాదాపు ఎవ్వరు వంటలు చేయరు. ప్రతి ఇంట్లో కిచెన్‌లో ఇవి కచ్చితంగా ఉంటాయి. మసాలలో అద్భుత ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. వీటిని వంటలలో వాడటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుంది. ఇవి మీ ఆహారానికి చాలా రుచిని అందిస్తాయి. మసాలలతో మరికొన్ని ఆకులు కూడా కూరలకి మంచి వాసన రుచిని అందిస్తాయి. అలాంటి వాటి గురించి తెలుసుకుందాం.

గరం మసాలా

గరం మసాలా అనేక మసాలా దినుసులను గ్రైండ్ చేసి తయారు చేస్తారు. ఇది మాంసాహార వంటలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. అవసరమైతే మీరు దీనిని కూరగాయల వంటకాలలో కూడా వాడవచ్చు. దీని రుచి అమోఘంగా ఉంటుంది. దీని సువాసన బలంగా ఉంటుంది.

కరివేపాకు

దక్షిణ భారతదేశం వంటకాల్లో కరివేపాకులను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది లేనిదే ఎటువంటి వంటలు చేయరు. కరివేపాకు ఆకులు రుచికరమైనవి మాత్రమే కాదు ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. ఆహారంలో ప్రత్యేకమైన సువాసన కోసం, వేడి నూనెలో వీటిని వేస్తారు. దీనివల్ల వంటకాలు చాలా రుచిగా ఉంటాయి.

యాలుక్కాయ

ఇది మన భారతీయ ఆహారంలో ఉపయోగించే మరొక మసాల దినుసు. ఇది ఆహారానికి మరంత రుచిని అందిస్తుంది. అంతేకాదు మంచి వాసన కలిగి ఉంటుంది. ఇది మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.

కొత్తిమీర

కొత్తిమీరని అనేక రకాల వంటకాలలో ఉపయోగిస్తారు. దీని వాసన అద్భుతంగా ఉంటుంది. దీనివల్ల కూరలు రుచిగా మారుతాయి. కూరగాయలు, పప్పులలో ఎక్కువగా ఉపయోగిస్తారు. మటన్‌, చికెన్‌, చేపల కూరలలో కూడా వేస్తారు.

Tags:    

Similar News