Health Tips: స్నానం చేసే నీటిలో చిటికెడు ఇది వేయండి.. చర్మ సమస్యలు దరిచేరవు..!

Health Tips: వేసవికాలంలో చాలామంది ఉక్కపోతతో బాధపడుతుంటారు...

Update: 2022-03-30 08:00 GMT

Health Tips: స్నానం చేసే నీటిలో చిటికెడు ఇది వేయండి.. చర్మ సమస్యలు దరిచేరవు..!

Health Tips: వేసవికాలంలో చాలామంది ఉక్కపోతతో బాధపడుతుంటారు. ఈ సీజన్‌లో ఫ్రెష్‌గా ఉండేందుకు స్నానం చేయాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం మీరు పసుపు నీటితో స్నానం చేస్తే అది చర్మ ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటుంది. వంటగదిలో పసుపును మసాలాగా ఉపయోగిస్తారు. అదే సమయంలో పసుపు తీసుకోవడం వల్ల శరీరంలోని అనేక సమస్యలు తొలగిపోతాయి.

కొంతమంది అందాన్ని కాపాడుకోవడానికి పసుపును ఉపయోగిస్తారు. అయితే పసుపు నీరు చర్మాన్ని అనేక సమస్యల నుంచి దూరంగా ఉంచుతుంది. పసుపు నీటితో స్నానం చేయడం వల్ల చర్మ సమస్యలు తొలగిపోతాయి. పసుపు నీటితో స్నానం చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఈ రోజు తెలుసుకుందాం. సోరియాసిస్ సమస్యతో బాధపడేవారు పసుపు నీళ్లతో తలస్నానం చేయడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు.

పసుపు లోపల యాంటీ-ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇదిసోరియాసిస్ లక్షణాలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. మొటిమల సమస్యను తొలగించడంలో పసుపు నీరు మీకు బాగా ఉపయోగపడుతుంది. దీంతో మరకలు పోవడమే కాకుండా చర్మాన్ని శుభ్రం చేసుకోవచ్చు. చర్మ గాయాలను నయం చేయడంలో కూడా పసుపు నీరు బాగా ఉపయోగపడుతుంది. ఈ నీటితో క్రమం తప్పకుండా స్నానం చేయడం వల్ల చర్మ గాయాలను త్వరగా నయం చేసుకోవచ్చు.

చర్మం మీద మొటిమలు అనేక రుగ్మతలు పసుపు వాడితే తగ్గుతాయి. ప్రతిరోజూ ఉదయం స్నానంచేయటానికి అరగంట ముందు పసుపు ఒంటికి బాగా పట్టించి తర్వాత స్నానం చేస్తే ఆరోగ్యంతో పాటు శరీర లావణ్యాన్ని కూడా పెంచుతుంది. పసుపు చూర్ణం, వేపాకు చిగుళ్ళు, దిరిసెన పట్టచూర్ణం సమాన భాగాలుగా తీసుకొని అప్లై చేస్తే చర్మవ్యాధులు తగ్గుతాయి.

Tags:    

Similar News