Health Tips: చలికాలంలో ఈ సూపర్‌ ఫుడ్స్‌ చాలా ముఖ్యం.. లేదంటే వ్యాధుల తాకిడి తట్టుకోలేరు..!

Health Tips: చలికాలం వచ్చిందంటే చాలు బాడీలో ఉండే అన్ని సమస్యలు ఒక్కొక్కటిగా బయటికి వస్తుంటాయి. చలికాలం మన ఆహారపు అలవాట్లు కూడా మారిపోతుంటాయి. చలికాలంలో జలుబు రాకుండా ఉండాలంటే శరీరాన్ని వెచ్చగా ఉంచే వాటిని తినాలి.

Update: 2023-12-17 07:50 GMT

Health Tips: చలికాలంలో ఈ సూపర్‌ ఫుడ్స్‌ చాలా ముఖ్యం.. లేదంటే వ్యాధుల తాకిడి తట్టుకోలేరు..!

Health Tips: చలికాలం వచ్చిందంటే చాలు బాడీలో ఉండే అన్ని సమస్యలు ఒక్కొక్కటిగా బయటికి వస్తుంటాయి. చలికాలం మన ఆహారపు అలవాట్లు కూడా మారిపోతుంటాయి. చలికాలంలో జలుబు రాకుండా ఉండాలంటే శరీరాన్ని వెచ్చగా ఉంచే వాటిని తినాలి. చలికాలంలో బెల్లం, నువ్వులు తినమని అమ్మమ్మలు చెప్పడం మీరు వినే ఉంటారు. ఈ రెండూ జలుబు నుంచి ఉపశమనం కలిగిస్తాయి. శీతాకాలంలో ఐదు సూపర్‌ ఫుడ్స్‌ని డైట్‌లో తప్పనిసరిగా చేర్చుకోవాలి. వాటి గురించి తెలుసుకుందాం.

ఖర్జూర

శీతాకాలంలో ఖర్జూరం తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలో విటమిన్ ఎ, బి పెద్ద మొత్తంలో లభిస్తాయి. ఖర్జూరం స్వభావం వేడిగా ఉంటుంది. ఇది చల్లని వాతావరణంలో ఉపశమనాన్ని అందిస్తుంది. ఇది శరీరాన్ని లోపలి నుంచి వెచ్చగా ఉంచుతుంది. భాస్వరం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఫైబర్ తగిన పరిమాణంలో ఉంటాయి. ఇవి అనేక వ్యాధుల నుంచి కాపాడుతాయి.

బెల్లం

శీతాకాలంలో బెల్లం తినడం శరీరానికి చాలా ప్రయోజనకరం. బెల్లం కడుపు, మొత్తం శరీరానికి చాలా ఉపయోగకరంగా పనిచేస్తుంది. దీన్ని తినడం వల్ల జీవక్రియ బాగా జరుగుతుంది. ఇది జీర్ణక్రియకు చాలా మేలు చేస్తుంది.ఇందులో ఐరన్ ఉంటుంది. ఇది రక్తహీనత వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే బెల్లం శరీరంలో వెచ్చదనాన్ని ఉత్పత్తి చేస్తుంది.

నువ్వులు

శీతాకాలంలో నువ్వులు తినడం చాలా ప్రయోజనకరం. నువ్వుల లక్షణాలు సహజంగా వేడిగా ఉంటాయి. చలికాలంలో శరీరాన్ని లోపలి నుంచి వెచ్చగా ఉంచడంలో సహాయపడుతాయి. శరీరానికి శక్తినిచ్చే నువ్వుల్లో కొవ్వు, ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. ఎముకలకు చాలా మేలు చేస్తాయి. నువ్వులు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, దగ్గు వంటి వ్యాధులతో పోరాడే శక్తి వస్తుంది.

వేరుశెనగలు

శీతాకాలంలో వేరుశెనగ తినడం చాలా మంచిది. వేరుశెనగలో పెద్ద మొత్తంలో కొవ్వు, ప్రోటీన్లు ఉంటాయి. ఇవి శక్తిని అందిస్తాయి శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. ఇది కాకుండా విటమిన్ ఇ, మెగ్నీషియం, ఫాస్పరస్, ఇతర ఖనిజాలు వేరుశెనగలో ఉంటాయి. ఇవి జలుబుతో పోరాడటానికి సహాయపడతాయి. వేరుశెనగ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది జలుబు, దగ్గు వంటి వ్యాధుల నుంచి మనలను రక్షించడంలో సహాయపడుతుంది. 

Tags:    

Similar News