సోషల్ మీడియానా మజాకా...3 గంటలు పనిచేసి 4.4 లక్షల సంపాదించిన మహిళ...ఏం చేసిందో తెలిస్తే షాకే..

social media: సోషల్ మీడియా యుగంలో డబ్బు సంపాదన అనేది చిటికెలో పనిగా మారిపోయింది ఒకప్పుడు లక్ష రూపాయలు సంపాదించాలంటే ఏడాది సమయం పట్టేది. ఆ తర్వాత నెమ్మదిగా నెలకు లక్ష రూపాయలు సంపాదించే రోజులు వచ్చాయి. కానీ ఈ సోషల్ మీడియా యుగంలో గంటకు లక్ష రూపాయలు వసూలు చేసే రోజులు వచ్చేసాయి.

Update: 2024-10-02 09:31 GMT

అవును మీరు వింటున్నది నిజమే తాజాగా శ్వేత కుక్రేజా అనే సోషల్ మీడియా స్ట్రాటజిస్ట్ తాను చేసిన ఓ పనికి కేవలం మూడు గంటల్లో 4.4 లక్షల రూపాయలు సంపాదించినట్లు తన ట్విట్టర్ అకౌంట్ లో పేర్కొంది. దీంతో అందరూ షాక్ తిన్నారు. సాధారణంగా ఈ స్థాయిలో ఆదాయం పొందాలంటే సుప్రీంకోర్టు లాయర్లు, సర్జన్లు గంటల చొప్పున లక్షల్లో వసూలు చేస్తూ ఉంటారు. కానీ ఓ సోషల్ మీడియా స్ట్రాటజీ డిసైడ్ చేసే ఓ వ్యక్తికి ఇంత రేంజ్ లో డబ్బులు అందిస్తారా అంటే మీరు ఆశ్చర్యపోవచ్చు.

అందుకే ఆమె తన అకౌంట్లో పడ్డ డబ్బులను కూడా స్క్రీన్ షాట్ పెట్టి మరి ట్విట్టర్ ద్వారా నెటిజన్లను షాక్ కి గురిచేసింది. ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో అద్భుతాలు జరుగుతున్నాయి. ఈ లెక్కన చూస్తే శ్వేతా కుక్రేజా చేసింది ఒక అద్భుతమనే చెప్పాలి. ఆమె కేవలం మూడు గంటల వ్యవధిలోనే 5200 డాలర్ల ఫీజును చేసింది. ఆమె చేసిన పని ఒక సోషల్ మీడియా సలహా ఇవ్వడం మాత్రమే. దీన్ని బట్టి సోషల్ మీడియాలో స్ట్రాటజిస్టులకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే శ్వేత పెట్టిన ఈ పోస్టు ప్రస్తుతం ట్విట్టర్లో వైరల్ గా మారింది.

దాదాపు 77 వేల మంది ఆమె పెట్టిన పోస్టులను చూసి కామెంట్ చేశారు. కాగా ప్రస్తుత కాలంలో సమయం కన్నా నైపుణ్యాన్ని ఎక్కువగా విలువ ఇస్తున్నారని కొంతమంది నెటిజన్లు పేర్కొన్నారు. మరోవైపు శ్వేత చేసిన వర్క్ తాము కూడా నేర్చుకుంటే బాగుంటుందని భావించారు. ఇదిలా ఉంటే ప్రస్తుత కాలంలో పల్లెటూర్లలో కూడా చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు.

అందుకు సంబంధించిన దాఖలాలు కూడా మనం చూస్తూనే ఉన్నాము. అందుకే సోషల్ మీడియాను ఉపయోగించుకొని యువత పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించుకోవచ్చు అని చాలామంది సూచిస్తున్నారు. కానీ ఈ డబ్బు సంపాదన చట్టబద్ధంగా మాత్రమే ఉండాలని, లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం కూడా ఉందని చాలామంది నిపుణులు సలహా ఇస్తున్నారు. మరి యువత ఈ అవకాశాన్ని ఎలా వాడుకుంటుందో వేచి చూడాలి.

Tags:    

Similar News