రాఫెల్ కేసులో తీర్పు రిజర్వ్‌

Update: 2019-03-14 14:01 GMT

రాఫెల్ కేసులో తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్‌ లో ఉంచింది . రివ్యూ పిటిషన్‌ కేసులో ఇరువురి వాదనలు విన్న కోర్టు డాక్యుమెంట్ల పరిశీలనకు సమయం కావాలంటూ జడ్జిమెంట్‌ ను హోల్డ్‌ లో పెట్టింది. అయితే రాఫెల్‌ డీల్‌ కు సంబంధించి కోర్టుకు సమర్పించిన కాగ్ నివేదికలో పొరపాటు జరిగిందన్నారు అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్. కాగ్ నివేదికలోని మొదటి మూడు పేజీలు మిస్సయ్యాయని ఆ పేజీలను రికార్డుల్లో చేర్చేందుకు కేంద్రానికి అనుమతి ఇవ్వాలంటూ కోరారు. ఎంతో గోప్యంగా ఉంచాల్సిన డాక్యుమెంట్స్‌ ను అనుమతి లేకుండా కోర్టుకు సమర్పించడం సరికాదన్నారు. అటార్నీ జనరల్‌ వాదనలపై పిటిషనర్లు ఫైరయ్యారు. ప్రతి అంశాన్ని జాతీయ భద్రత పేరుతో తొక్కిపెట్టడం కుదరదన్నారు. దీంతో ఇరువురి వాదనలు విన్న సుప్రీం కోర్టు రాఫెల్ అంశంపై తీర్పును రిజర్వ్ లో ఉంచింది.

Similar News