కృష్ణా జిల్లా ఇబ్రహీం పట్నంలో ఓ యువతి ప్రేమికుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది. భాగ్యలక్ష్మీ, జోసఫ్ కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. కానీ ఇటీవల జోసఫ్ యువతితో మాట్లాడడం మానేశాడు. దీంతో బాధితురాలు ఆ వ్యక్తి ఇంటి ముందు బైఠాయించింది. ఇదే విషయంపై గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా తనకు న్యాయం జరగలేదని, అందుకే రోడ్డు పైకి వచ్చానని చెప్తోంది బాధితురాలు.
తనను నమ్మించి, లోబరుచుకుని, ఆర్థికంగా వాడుకుని వదిలేశాడని యువతి ఆవేదన వ్యక్తం చేస్తోంది బాధితురాలు నాగలక్ష్మీ. 5 నెలలుగా తనకు న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాని తెలిపింది. తనను ప్రేమించి, మరో యువతితో జోసఫ్ పెళ్లికి రెడీ అయ్యాడని ఆవేదన వ్యక్తం చేస్తోంది. మరో యువతి తనలా మోసపోకూడదని, జోసఫ్ తనను పెళ్లి చేసుకోవాలని, లేదంటే అతని ఇంటి ముందే ఆత్మహత్య చేసుకుంటానంటోంది బాధితురాలు. నమ్మి ప్రేమిస్తే మోసం చేశాడని ఆరోపించింది. కేసు తిరిగి పోలీస్ స్టేషన్‌కు చేరటంతో జోసఫ్‌రాజుకు 2018లోనే వివాహం అయ్యిందని జోసఫ్ తండ్రి శామ్యూల్ చెబుతున్నాడు. కాగా, దీనిపై సీఐ దుర్గారావును వివరణ కోరగా జోసఫ్‌రాజుపై 2018లోనే కేసు నమోదు చేశామని, అది కోర్టు పరిధిలో ఉందని చెప్పారు.