ల‌వ్ జిహాద్‌....హైదరాబాద్‌లో మ‌త మార్పిడి క‌ల‌క‌లం...అస‌లు విష‌యం ఇద‌ట‌

Update: 2019-06-02 00:42 GMT

హైదరాబాద్‌లో లవ్ జిహాద్ వ్యవహారం కలకలం రేపుతోంది. ప్రేమ పేరుతో తమ కూతురిని మోసం చేసి రిజ్వాన్‌అనే యువకుడు మతం మార్చి పెళ్లి చేసుకున్నాడని పంజాగుట్ట పోలీసుల్ని ఆశ్రయించారు యువతి తల్లిదండ్రులు ఆశ్రయించారు. తమ కూతురిని చూపించక పోతే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరిస్తున్నారు.

మంచిర్యాలకు చెందిన ఇందిర అలియాస్ జుబేరా టెక్ మహేంద్రలో పనిచేస్తోంది. ఈమెకు కరీనంగర్ కు చెందిన రిజ్వాన్ తో 2018 జులైలో వివాహం అయింది. రిజ్వాన్ గచ్చిబౌలిలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి. కరీనంగర్ లోని వివేకానంద కాలేజ్ లో ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలో వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. అదికాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి తల్లిదండ్రులకు దూరంగా హైదరాబాద్ లోనే ఉంటోంది ఇందిర.

అయితే తమ అమ్మాయికి బలవంతంగా మత మార్పిడి చేశారని ఇందిర తల్లిదండ్రులు రేణుక, మహేష్ ఆరోపిస్తున్నారు. రిజ్వాన్.. లవ్ జిహాద్ పేరుతో తమ అమ్మాయిని ట్రాప్ చేశాడని ఆరోపించడం సంచలనంగా మారింది. కొంతకాలంగా ఇందిర తమ ఫోన్ కాల్ కూడా లిఫ్ట్ చేయడం లేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. రాత్రి ఇందిర ఫోన్ నుంచి అమ్మా నాన్నలను చూడాలని ఉందని మెసేజ్ వచ్చిందని అప్పటి నుంచి ఆమె అందుబాటులోకి రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు తమ కూతురు బతికుందో లేదో అనే ఆందోళన కలుగుతుందని.. ఒక్కసారి తమ కూతురును చూడాలని ఉందని వేడుకుంటున్నారు.

తమ అమ్మాయిని లవ్ జిహాద్ పేరుతో సిరియాకు తరలించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అయితే ఇందిర తల్లిదండ్రులు రేణుక, మహేష్ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదంటున్నారు పోలీసులు ఇష్టపూర్వకంగానే రిజ్వాన్ ను వివాహం చేసుకున్నట్లు ఇందిర తమకు లిఖితపూర్వకంగా రాసి ఇచ్చిందని పంజాగుట్టు ఏసీపీ తిరుపతన్న స్పష్టం చేశారు. అయినప్పటికీ తల్లిదండ్రుల అనుమానాలు నివృత్తి చేసేందుకు విచారణ చేస్తామని చెబుతున్నారు.

Similar News