ఓ యువతితో పెళ్లిపీటలు ఎక్కాడు. మరో యువతితో సహజీవనం చేశాడు. దీంతో సహజీవనం చేసిన యువతి ఆ యువకుడు మరో పెళ్లి చేసుకుంటున్నాడనే విషయం తెలుసుకున్న బాధితురాలు తాను మోసపోయానని తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక వివరాల్లోకి వెళితే మహబూబ్ నగర్ జిల్లా ఘన్‌పూర్ మండలం అప్పారెడ్డిపల్లికి చెందిన పాతికేళ్ల సుధాకర్ ఓ ప్రయివేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఇదే క్రమంలో గగన్ పహాడ్ మెట్రోషాపింగ్ మాల్‌లో పనిచేస్తున్న 22ఏండ్ల అమ్మాయిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. తానను ఎదురైనప్పుడల్లా ప్రేమిస్తున్నానని, నిన్ను ప్రేమిస్తున్నానని, నువ్వు ఓకే లగ్గం చేసుకుందాం అని మాయమాటలు చెప్పేవాడు. వీరిద్దరి విషయం గమనించిన ఎవడో కుర్రాడు అమ్మాయి తండ్రికి విషయం చెప్పాడు. దీంతో వారిని పిలిపించాడు తండ్రి. మీరు ఒప్పుకుంటే మీ అమ్మాయిని వివాహం చేసుకుంటానంటూ చెప్పాడు సుధాకర్. దీంతో తలిదండ్రులు కూడా ఓకే చెప్పారు. ఇంకేముంది తలిదండ్రులు ఓకే చెప్పడంతో ఎగిరిగంతేసారు. ఇక పనిలోపనిగా శంషాబాద్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు సుధాకర్.
ఇక అప్పటి నుండి ఆమెను తీసుకెళ్లి సహజీవనం మొదలుపెట్టాడు సుధాకర్. ఈ క్రమంలోనే ఇలా ఎన్నిరోజులు మనం పెళ్లి చేసుకుందాం అని యువతి గట్టిగ ప్రశ్నించింది. అంతే ఇక మనోడి గేమ్ స్టాట్ చేశాడు. మీ ఇంట్లో ఒప్పుకున్నారు కానీ మా ఇంట్లో ఒప్పుకోవడం లేదు. కట్నం కావాలనంటున్నారు అని నాటకాలాడాడు సుధాకర్. ఇక అప్పటి నుండి శంషాబాద్ రావడం బంద్ చేశాడు. వెంటనే ఆ యువతికి అనుమానం వచ్చి సుధాకర్‌కి తెలియకుండా అతని బంధువులకు సంబంధించిన కొన్ని ఫోన్ నంబర్స్ సేకరించింది. ఆ నంబర్స్ కాల్ చేసి సుధాకర్ గురించి అడగ్గా మే 30న సుధాకర్ మరో యువతితో పెళ్లిచేసుకోబోతున్నాడని తెలిసి ఒక్కసారిగా కంగుతిన్నది ఆ యువతి. దీంతో తాను మోసపోయానని లబోదిబోమని నెత్తినోరు కొట్టుకుంది. దీంతో కాస్తా ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చెయ్యాలని వేడుకుంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సుధాకర్ కోసం వేట మొదలుపెట్టారు. అయితే ఇలాంటి ఓ కేసులో రాజస్థాన్ హైకోర్టు ప్రత్యేక తీర్పు ఇచ్చింది. మహిళతో సహజీవనం చేస్తున్నవారు పెళ్లి చేసుకోకపోయినా, సామాజికపరంగా పెళ్లైపోయినట్లేనని చెప్పింది. అలాంటి వారు మరో పెళ్లి చేసుకోవడం నేరమే.