Activa E : హోండా కంపెనీ మాస్టర్ ప్లాన్.. 365రోజుల్లో లక్ష మందికి యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
Activa E : హోండా మోటార్‌సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా (HMSI) ఎట్టకేలకు భారత మార్కెట్లో తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది.
Activa E : హోండా మోటార్‌సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా (HMSI) ఎట్టకేలకు భారత మార్కెట్లో తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. ఇది రిమూవబుల్, నాన్-రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ ఆఫ్షన్లలో లాంచ్ చేసింది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లతో భారీగా కస్టమర్లను లక్ష్యంగా చేసుకుంది. HMSI మొదటి సంవత్సరంలో (365 రోజులు) సుమారు లక్ష ఎలక్ట్రిక్ స్కూటర్లను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో Activa E, QC1 రెండూ ఉన్నాయి. హోండాకు అల్వార్ (రాజస్థాన్), మనేసర్ (హర్యానా), విఠల్‌పూర్ (గుజరాత్)లలో మూడు ప్లాంట్లు ఉన్నాయి. అయితే, ఈవీని నరసపుర (కర్ణాటక) ప్లాంట్‌లో మాత్రమే ఉత్పత్తి చేస్తారు. ఇది ఓలా, టీవీఎస్, బజాజ్, ఏథర్‌లతో పోటీపడనుంది.
ఓలా, బజాజ్ చేతక్, ఏథర్ వంటి పాపులర్ ఈవీలు నాన్-రిమూవబుల్ బ్యాటరీలతో మాత్రమే అందిస్తున్నాయి. అయితే, ఇటీవల ఓలా రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్‌తో కూడిన కొత్త మోడల్‌ను ప్రవేశపెట్టింది. Activa E, QC1 గురించిన పూర్తి వివరాలను కంపెనీ షేర్ చేసింది. అయితే వాటి ధరలు జనవరి 2025లో కంపెనీ వెల్లడించనుంది. కంపెనీ ఈ స్కూటర్లలో 99శాతం స్థానికంగా ఉత్పత్తి చేసింది.. కాబట్టి వాటి ధరలు తక్కువగా ఉండవచ్చు. స్కూటర్‌ను వేగంగా డెలివరీ చేయడానికి, కంపెనీ దేశంలో వివిధ దశల్లో దీన్ని విడుదల చేస్తుంది. తొలుత ఢిల్లీ, ముంబై, బెంగళూరులలో విక్రయించనున్నారు.
హోండా యాక్టివా ఇ స్కూటర్ వివరాలు
హోండా తన యాక్టివా ఇ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. 1.5kWh ఎక్స్ ఛేంజబుల్ డ్యూయల్ బ్యాటరీలు ఇందులో సెటప్ చేయబడ్డాయి. ఈ రెండు బ్యాటరీలు ఫుల్ ఛార్జింగ్‌పై 102కిమీల రేంజ్‌ను ఇస్తాయని పేర్కొంది. ఈ బ్యాటరీలు 6kW ఫిక్స్‌డ్ మాగ్నెట్ సింక్రోనస్ ఎలక్ట్రిక్ మోటారుకు శక్తిని అందిస్తాయి, ఇది 22Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఎకాన్, స్టాండర్డ్, స్పోర్ట్ అనే మూడు రైడింగ్ మోడ్‌లు ఇందులో పొందుపరచబడ్డాయి. దీని గరిష్ట వేగం గంటకు 80 కి.మీ. 0 నుండి 60 కిమీ/గం వేగాన్ని 7.3 సెకన్లలో అందుకోవచ్చు. ఇది 7-అంగుళాల TFT స్క్రీన్‌ను కలిగి ఉంది. స్క్రీన్ నావిగేషన్‌కు మద్దతు ఇస్తుంది.
హోండా QC1 స్కూటర్ వివరాలు
కంపెనీ QC1 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కూడా విడుదల చేసింది. ఇది ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 80 కిలోమీటర్ల రేంజ్‌ను అందజేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ స్థిర 1.5 kWh బ్యాటరీ ప్యాక్‌తో అందించబడింది. ఇది 7.0-అంగుళాల TFT స్క్రీన్‌ను కలిగి ఉంది, ఇది Honda Road Sync Duo యాప్‌తో రియల్ టైం కనెక్టివిటీని అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ స్థిరమైన 1.5 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. దీని పవర్ అవుట్‌పుట్‌లు 1.2 kW (1.6 bhp) మరియు 1.8 kW (2.4 bhp). ఎలక్ట్రిక్ స్కూటర్ 0 నుండి 75శాతం వరకు ఛార్జ్ చేయడానికి 3 గంటలు పడుతుంది. పూర్తి ఛార్జింగ్ కావాలంటే ఆరు గంటలు పడుతుంది.